కుమ్రం భీం ఆసిఫాబాద్ : ఎంబీబీఎస్ సీట్ వచ్చిన పేద ఇంటి చదువుల తల్లి వైద్య విద్య చదువు బాధ్యత మొత్తం నాదేనని కాగజ్నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప హామీ ఇచ్చారు. ‘చదువుల తల్లికి సాయమందించరూ..’ అనే శీర్షికకు ఎమ్మెల్యే కోనప్ప స్పందించారు.
కరిష్మా వైద్య విద్య చదువుకు పూర్తి సహకారం అందిస్తానని, బాగా చదివి నియోజక వర్గానికి పేరు తేవాలని ఆయన తెలిపారు. ఆదివారం ఆమెను జిల్లాలోని కాగజ్నగర్ ఆయన నివాసంలో సన్మానించారు.