Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమానం.. ఆరుగురు గల్లంతు
Mississippi Plane Crash | అమెరికాలోని మిస్సిసిపీ తీరంలో మంగళవారం మధ్యాహ్నం చిన్న విమానం సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు.
Mississippi Plane Crash | అమెరికాలోని మిస్సిసిపీ తీరంలో మంగళవారం మధ్యాహ్నం చిన్న విమానం సముద్రంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. దీంతో వారి ఆచూకీ కోసం కోస్ట్‌గార్డ్, ఇతర సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ప్రమాద స్థలంలో మూడు లైఫ్ జాకెట్లు, ఓ లైఫ్ రాఫ్ట్, విమానం క్యాబిన్‌ను గుర్తించినప్పటికీ ప్రయాణికుల ఆచూకీ లభించలేదు.
మిసిసిపీ నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ మైయర్స్ వైపు మంగళవారం మధ్యాహ్నం (అమెరికా కాలమాన ప్రకారం) సెస్నా 210 (Cessna 210) విమానం బయల్దేరింది. అందులో నలుగురు పెద్దలు, 8, 10 ఏళ్ల వయసున్న ఇద్దరు బాలురు ఉన్నారు. అయితే మధ్యాహ్నం సుమారు 3.30 నుంచి 3.45 గంటల సమయంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయి. మిసిసిపీ తీరంలోని హార్న్ ఐలాండ్ సమీపంలో గల గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో ఈ విమానం కూలినట్లుగా ప్రాథమిక రాడార్ సమాచారం అందింది. దీంతో అమెరికా కోస్ట్‌గార్డ్ ఆధ్వర్యంలో పలు విభాగాలు సహాయక చర్యల కోసం రంగంలోకి దిగాయి.
ప్రమాద ప్రాంతంలో మూడు లైఫ్ జాకెట్లు, లైఫ్ రాఫ్ట్, విమానం క్యాబిన్ నీటిపై తేలుతూ కనిపించినట్లు కోస్ట్‌గార్డ్ అధికారులు వెల్లడించారు. అయితే విమానంలో ఉన్న ఆరుగురి ఆచూకీ మాత్రం ఇంకా లభించలేదు. విమాన ప్రమాదంపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA), నేషనల్ ట్రాన్స్‌పోర్టేషన్ సేఫ్టీ బోర్డు (NTSB) దృష్టి సారించాయి. గాలింపు, సహాయక చర్యలు పూర్తయిన అనంతరం ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టనున్నాయి. విమానంలో ప్రయాణించిన వారి వివరాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi cafe | ఢిల్లీలో దారుణం.. కేఫ్‌లో యువతిపై సామూహిక లైంగిక దాడి, ముగ్గురి అరెస్ట్
I Hate Marriage | ‘ఐ హేట్ మ్యారేజ్’ బోల్డ్ సినిమా కాదు.. హార్ట్ టచ్చింగ్ లవ్‌స్టోరీ: దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల
Gold prices | మళ్లీ తగ్గిన బంగారం, వెండి ధరలు.. కొనుగోలు దారుల్లో జోష్..!
Vishwambara | సంక్రాంతి బరిలో మెగాస్టార్ విశ్వంభర.. కాకాతో పోటీ తప్పదా?
రూ.86 వేల iQOO 16 ఫోన్ మలేషియాలోకి.. భారత్‌లో లాంచింగ్ ఎప్పుడో!!
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

