శభాష్ ఇషా సింగ్

- యువ షూటర్‌ను అభినందించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: లిమా(పెరూ) వేదికగా జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు రజత పతకాలతో అదరగొట్టిన తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్‌ను రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రత్యేకంగా అభినందించారు. మెగాటోర్నీలో అంచనాలకు మించి రాణించిన ఇషాసింగ్ బుధవారం నగరానికి చేరుకుంది. శంషాబాద్ విమానాశ్రయంలో ఇషాసింగ్‌కు సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి సాదర స్వాగతం పలికారు. రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో ఇషాను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శాలువ కప్పి పుష్పగుచ్చంతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నాం. గత ఆరేండ్లుగా ప్లేయర్లు, కోచ్‌లను ప్రోత్సహించడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాం. షూటింగ్ క్రీడాభివృద్ధి కోసం గచ్చిబౌలిలో అకాడమీ ఏర్పాటుకు స్థలం కేటాయించాం. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు నగదు పురస్కారాల మొత్తాన్ని పెంచాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్టాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఇషాసింగ్ తండ్రి సచిన్‌సింగ్, సాట్స్ డీడీ సుజాత తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

