అభినవ్, రమ్య జంటగా నటిస్తున్న చిత్రం ‘మైల్స్ ఆఫ్ లవ్’. నందన్ దర్శకుడు. రాజురెడ్డి నిర్మాత. ఈ నెల 29న ప్రేక్షకులముందుకురానుంది. సోమవారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో కార్తికేయ థియేట్రికల్ ట్రైలర్ను ఆవిష్కరించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘కొత్తదనం కలబోసిన ప్రేమకథతో తెరకెక్కించాం. నేటి యువతరం మెచ్చే అన్ని అంశాలుంటాయి. రొమాంటిక్ ఎంటర్టైనర్గా మెప్పిస్తుంది. పాటలకు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అన్నారు. రొటీన్ లవ్స్టోరీస్కు భిన్నంగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినందించే చిత్రమిదని నిర్మాత తెలిపారు. హీరో మాట్లాడుతూ ‘పాటలన్నీ సంగీత ప్రియుల్ని విశేషంగా అలరిస్తున్నాయి. మ్యూజిక్ విజయం సాధించడం సినిమాపై నమ్మకాన్ని పెంచింది. హృద్యమైన ప్రేమకథా చిత్రంగా గుర్తుండిపోతుంది’ అన్నారు.