MI vs UPW : యూపీ వారియర్స్ మరింత కష్టాల్లో పడింది. కీలక బ్యాటర్ తహ్లియా మెక్‌గ్రాత్ (7) రనౌట్ అయింది. దాంతో, 21 రన్స్‌కే ఆ జట్టు మూడో వికెట్ కోల్పోయింది. కిరణ్ నవగిరే(6), గ్రేస్ హ్యారిస్ (1) క్రీజులో ఉన్నారు. అంతకుముందు ఇసీ వాంగ్ ఓవర్లో ఓపెనర్ అలిసా హీలీ (11) ఔటయ్యింది. ఐదు ఓవర్లకు మూడు వికెట్ల నష్టానికి యూపీ 26 రన్స్ చేసింది.
12 రన్స్‌కే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన యూపీని కిరణ్, మెక్‌గ్రాత్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ మెక్‌గ్రాత్ రనౌట్ కావడంతో ఆ జట్టు మరింత కష్టాల్లో పడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ 8 రన్స్ వద్ద తొలి వికెట్ కోల్పోయింది. సైకా ఇషాక్ వేసిన రెండో ఓవర్లో మాథ్యూస్‌కు క్యాచ్ ఇచ్చి శ్వేతా షెరావత్(1) వెనుదిరిగింది.