శివ కంఠమనేని, సంజన గల్రాని, ప్రియాహెగ్డే ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మణిశంకర్’. జి.వెంకటకృష్ణన్(జీవీకే) దర్శకుడు. కె.ఎస్.శంకర్రావు, ఆచార్య శ్రీనివాసరావు, ఎం.ఫణిభూషణ్ నిర్మాతలు. సోమవారం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. మణిశంకర్ ఎవరు? అతడి పోరాటం ఎందుకోసమన్నది ఆకట్టుకుంటుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి’ అని తెలిపారు. కొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను రూపొందిస్తున్నామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్ రాజా, ఛాయాగ్రహణం: జె ప్రభాకర్‌రెడ్డి.