Manchu Lakshmi | మోహన్ బాబు ముద్దులు కూతరు మంచు లక్ష్మీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. హోస్ట్‌గా కెరీర్ తొలినాళ్లలో అదరగొట్టిన మంచు లక్ష్మీ ఆ తర్వాత నటిగా మారింది. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తుంది. ఇదే క్రమంలో హనీరోజ్ మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి ఓ సినిమా చేసింది మంచు లక్ష్మీ. ఆ సినిమా పేరు మాన్స్టర్. ఈ సినిమా సస్పెన్స్ థిల్లర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో మంచు లక్ష్మీ కీలక పాత్ర పోషించింది. అలాగే ఈ సినిమాలో మంచు లక్ష్మీ,హనీరోజ్ లెస్బియన్స్ గా నటించారు. అంతే కాదు ఈ సినిమాలో లక్ష్మీ మంచు, హనీ రోజ్ డీప్ లిప్ కిస్ కూడా ఉంది.
ఈ మూవీ క్లైమాక్స్ సీన్ లో లక్ష్మీ మంచు, హనీ రోజ్ లిప్ లాక్ సీన్ ఉండగా, ఇంటిమేట్ సీన్స్ లో ఈ ఇద్దరు రెచ్చిపోయి నటించారు. సినిమా వచ్చి చాలా రోజులే అయినా మరోసారి యూట్యూబ్‌లో ఈ మూవీ సీన్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే కరణ్ జోహార్ హోస్ట్ చేస్తూ నిర్మిస్తున్న ఇండియన్ వర్షెన్ ది ట్రైటర్స్ లో మంచు లక్ష్మీ కీలక పాత్రలో కనిపిస్తుంది. ఉల్లు ఫ్లాట్ ఫామ్ బోల్డ్ స్టార్స్ కూడా ఇందులో పాల్గొంటున్నారు. అయితే తాజాగా మంచు లక్ష్మీ ఎంట్రీకి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమ్ కాగా, అందులో ఓ కంటెస్టెంట్‌తో మంచు లక్ష్మీ గొడవపడింది. రామాయణంలో రాముడు నీటిలో చూస్తూ పైన ఉన్న చేపని విల్లుతో కొట్టాడని వాదనకి దిగింది.
దీంతో ఎవరు ఈమె? ఏం మాట్లాడుతుంది అంటూ నార్త్ ఇండియన్స్ మంచు లక్ష్మీకి సంబంధించిన క్లిప్పింగ్‌ని సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఈవిడ మహాభారత కథని రామాయణంగా మార్చిందని ట్రోల్ చేస్తున్నారు. ఈ వీడియోలో మంచు లక్ష్మీని చూసిన తెలుగోళ్లు కూడా తెగ తిట్టేస్తున్నారు. ఆ అవతారం ఏంది? ఆ కథేంది? పరువు తీస్తున్నావు కదా అంటూ తిట్టిపోస్తున్నారు.