Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Siddharth Galla | సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ, అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ - పద్మావతి దంపతుల రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ, అమరరాజా గ్రూప్ ఛైర్మన్ గల్లా జయదేవ్ – పద్మావతి దంపతుల రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కొంతకాలంగా తాను ప్రేమిస్తున్న దక్షిణ కొరియాకు చెందిన యువతి హైన్ కిమ్ (Hyein Kim) మెడలో సిద్ధార్థ్ మూడు ముళ్లు వేశారు. వియత్నాంలోని ఒక అందమైన దీవిలో ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి డెస్టినేషన్ వెడ్డింగ్ అత్యంత వైభవంగా జరిగింది.
మూడు రోజుల పాటు సాగిన ఈ వేడుకల్లో రెండు కుటుంబాల సంస్కృతులకు గౌరవం ఇస్తూ హిందూ, కొరియన్ మరియు పాశ్చాత్య (Western) సంప్రదాయాల్లో వివాహ క్రతువులు నిర్వహించారు. కాలేజీ రోజుల నుంచే పరిచయమున్న వీరి ప్రేమకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. తాజాగా జరిగిన పెళ్లి వేడుకలో నమ్రతా శిరోద్కర్, మంజుల ఘట్టమనేని సహా ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులు సందడి చేశారు. అయితే, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ బిజీ కారణంగా మహేశ్ బాబు ఈ వేడుకకు హాజరు కాలేకపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సిద్ధార్థ్ – హైన్ కిమ్ పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Siddharth Galla | కొరియా అమ్మాయిని పెళ్లాడిన మహేశ్ బాబు మేనల్లుడు.. వైరల్ అవుతున్న సిద్ధార్థ్ గల్లా వెడ్డింగ్ ఫొటోలు!
Niharika Konidela | కుందనపు బొమ్మలా మెరిసిన మెగా డాటర్.. నిహారిక ఫొటోలు వైరల్
MK Stalin | రాహుల్ గాంధీ ట్వీట్‌కు ధీటైన సమాధానమిచ్చిన తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్
Rishab Shetty | రిషబ్ శెట్టి, నాగవంశీ కాంబినేషన్లో కొత్త సినిమా.. ‘మోటార్‌సైకిల్ డైరీస్’ ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయిందిగా!
IFFI 2026 | గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో భారతీయ సినిమా సత్తా: ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి.. ‘హనుమాన్ అంశ్’ దర్శకుడికి ప్రతిష్ఠాత్మక పురస్కారం!
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

