ముంబై: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ రేపు ప్రమాణం చేసే అవకాశాలు ఉన్నాయి. రాబోయే 48 గంటల్లో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రమాణ స్వీకారోత్సవానికి శివసేన రెబల్ ఎమ్మెల్యేలు అందరూ హాజరుకానున్నారు. ఏక్నాథ్ షిండే వర్గంతో పాటు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు కూడా హాజరవుతారు. అయితే రెబల్ వర్గానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలకు ఫడ్నవీస్ క్యాబినెట్లో బెర్త్ దొరికే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు స్వతంత్య్రులకు కూడా మినిస్టర్ పదవి దక్కే ఛాన్సు ఉంది. సీఎం ఉద్ధవ్ రాజీనామాను గవర్నర్ కోశియారి ఆమోదించారు.