Madonna Sebastian | మలయాళ, తమిళ సినిమాలతో గుర్తింపు పొందిన మడోన్నా సెబాస్టియన్ ప్రేమమ్ సినిమాతో ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకుంది. తెలుగులో ఆమె రెండు సినిమాల్లో నటించింది, అందులో ఒకటి ప్రేమమ్ రీమేక్ , రెండోది నాని హీరోగా వచ్చిన శ్యామ్ సింగరాయ్. ఈ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందిన మడోనా, సినిమా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే మడోన్నాకి సినిమా అవకాశాలు రాకపోయిన కూడా పెద్దగా గ్లామర్ షో చేయదు. అయితే ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటో అందరు షాక్ అయ్యేలా చేసింది. పొట్టి బట్టలు ధరించి గ్లామర్ షో చేసిన ఫోటో చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. కొంత మంది ఫ్యాన్స్ ఆమెను ట్యాగ్ చేస్తూ అసభ్యమైన కామెంట్లు చేశారు.
ఈ విషయంపై మడోన్నా స్పందిస్తూ, “గ్లామర్ షో చేయడం తప్పు కాదు.. కానీ గ్లామర్ కు , అసభ్యతకు మధ్య వ్యత్సాసం ఏంటనేది తెలిస్తే చాలు.. అది నాకు తెలుసు కాబట్టి నేనెం చేస్తున్నానో నాకు అర్ధమవుతుంది.. అంటూ కౌంటరిచ్చింది . చూస్తుంటే మడోన్నా రానున్న రోజులలో తన గ్లామరస్ షోతో ప్రేక్షకులకి మంచి వినోదం పంచనుందని అర్ధమవుతుంది. ఈ భామ ఇప్పుడిప్పుడే తెలుగులో అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో రాబోతున్న స్పిరిట్ చిత్రంలో అవకాశం అందుకున్నట్టు టాక్.
కొన్ని రోజుల క్రితం మడోన్నా బీచ్ లో గ్లామర్ ఫోటోలతో సృష్టించిన అరాచకానికి సోషల్ మీడియా షేక్ అయింది. కొందరు ఆమె అందాన్ని ఆస్వాదించగా, మరి కొంత మంది విపరీతమైన ట్రోల్స్ చేశారు.ఈ నేపథ్యంలో మడోన్నా వాటికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇప్పుడు ఈ భామ గ్లామరస్ షోకి కూడా సిద్ధం కాగా, రానున్న రోజులలో మంచి అవకాశాలు అందుకుంటుందా లేదా అనేది చూడాలి.