MAA Elections | బ్యాలెట్ ద్వారానే ‘మా’ ఎన్నికలు : కృష్ణమోహన్
MAA Elections | బ్యాలెట్ ద్వారానే ‘మా’ ఎన్నికలు : కృష్ణమోహన్ | తెలుగు రాష్ట్రాల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న ఎన్నికల

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న ఎన్నికల మరింత వాతావరణం వేడెక్కుతున్నది. ఓ వైపు ఎన్నికల్లో రెండు ప్యానళ్ల మధ్య మాటల యుద్ధం సాగుతున్నది. ఎప్పుడూ ప్రచారాలు, ఆరోపణలకే పరిమితం కాగా.. ఈ సారి ఫిర్యాదుల వరకు వెళ్లాయి. ఇవాళ ఉదయం ప్రకాశ్ రాజ్ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తూ.. మంచు విష్ణు ప్యానల్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తుందంటూ ఆరోపించారు.
బ్యాలెట్ పేపర్ విధానం ద్వారానే ‘మా’ ఎన్నికలు జరిపించాలని కోరుతూ మంచు విష్ణు ఎన్నికల అధికారికి లేఖ రాశారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారి కృష్ణమోహన్ వివరించారు. బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరుగాలని విష్ణు లేఖ రాశారని చెప్పారు. ఈవీఎం ద్వారా ఎన్నికలు జరుపాలని ప్రకాశ్‌రాజ్ కోరారన్నారు. ఇద్దరి ప్రతిపాదనలను కృష్ణంరాజుకు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కూడా బ్యాలెట్‌కే మొగ్గు చూపారన్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వుల మేరకు ‘మా’ పోలింగ్ జరుగుతుందని స్పష్టం చేశారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

