Liverpool Footballer : లివర్‌పూల్ ఫార్వర్డ్ లూయిస్ డియాజ్(Luis Diaz) తల్లిదండ్రులు కిడ్నాప్‌కు గురైన విషయం తెలిసింది. అయితే.. కిడ్నాపర్లు అతడి తల్లిని మాత్రమే విడుదల చేశారు. దాంతో తన తండ్రిని కూడా విడిచిపెట్టాలని లూయిస్ ఆదివారం కిడ్నాపర్లను ప్రాధేయపడ్డాడు.
ఫ్లోరిడా ఆతిథ్యం ఇస్తున్న ప్రీమియర్ లీగ్(Premier League 2023)లో ల్యూటన్ క్లబ్(Luton Town)తో జరిగిన మ్యాచ్‌లో లూయిస్ బరిలోకి దిగాడు. సబిస్టిట్యూట్‌గా వచ్చీ రావడంతోనే గోల్ కొట్టిన అతడు ఆ గోల్‌ను కిడ్నాపర్ల చెరలో ఉన్నతండ్రికి అంకిమిచ్చాడు.
అనంతరం టీ షర్ట్‌పై ‘ఫ్రీడమ్ ఫర్ డాడ్’ అని రాసున్న అక్షరాలు కనిపించేలా తన జెర్సీని నోటకరచుకున్నాడు. అంతేకాదు తన తండ్రిని విడుదల చేయాలంటూ కొలంబియా కిడ్నాపర్లను అభ్యర్థించాడు. ఆ కాసేపటికే కొలంబియా గొరిల్లా(colombian guerilla movement) దళ సభ్యులు అతడి తండ్రిని విడుదల చేస్తామని ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు చెరొక గోల్ చేయడంతో 1-1తో మ్యాచ్ టైగా ముగిసింది.