ఒకటి కాదు.. రెండు!
ఒక వేలికి పెట్టుకుంటే మాత్రం ఒకటే ఉండాలని రూలేముంది? అలా అని, రెండూ వేరువేరు ఉంగరాలు కావాలన్న నియమమూ లేదు. అందుకే అమ్మాయిలూ అబ్బాయిల్లా విడివిడిగా ఉన్నా.. ప్రేమికుల మనసుల్లా ఒకటిగా పెనవేసుకునే అంగుళీకాలు వస్తున్నాయి.
ఒక వేలికి పెట్టుకుంటే మాత్రం ఒకటే ఉండాలని రూలేముంది? అలా అని, రెండూ వేరువేరు ఉంగరాలు కావాలన్న నియమమూ లేదు. అందుకే అమ్మాయిలూ అబ్బాయిల్లా విడివిడిగా ఉన్నా.. ప్రేమికుల మనసుల్లా ఒకటిగా పెనవేసుకునే అంగుళీకాలు వస్తున్నాయి. గొలుసులతో జతయ్యే ఈ జోడు ఉంగరాలు ‘లింక్డ్ చైన్ రింగ్స్’ పేరిట ఫ్యాషన్‌గా మారాయి!

ప్రేమ కానుకల్లో ముందువరుసలో నిలిచేది ఉంగరాలే. ‘నిను డైమండ్ రింగై రమ్మంది నా టెండర్ ఫింగరే’.. అంటూ పాటలూ అల్లేస్తున్నారు. అందుకే, అంగుళీకాల్లో ఎన్నడూలేనన్ని వెరైటీలను మన్నికగా తయారు చేస్తున్నారు డిజైనర్లు. ప్రియమైన వారి ముఖంలానే.. ఒక్కసారి చూస్తే వందసార్లు తలచుకునేంత ప్రత్యేకంగానూ రూపొందిస్తున్నారు.

ఈ జోడు ఉంగరాలను ‘లింక్డ్ చైన్ రింగ్స్’, ‘కనెక్టెడ్ చైన్ రింగ్స్’ అని పిలుస్తున్నారు. ఇందులో రెండు ఉంగరాలు సన్నని చైన్లతో అనుసంధానమై ఉంటాయి. రెండూ ఒకే డిజైన్‌తో వచ్చే వాటితో పాటు, ఒకదానికొకటి మ్యాచింగ్‌గా ఉంటూ వేరువేరు డిజైన్లతో తయారవుతున్నవీ ఉన్నాయి. సాదాగా ఉండేవి, రకరకాల రాళ్లు పొదిగినవే కాదు.. నాజూగ్గా, ఘనంగా కనిపించేవీ ఉన్నాయి. బంగారం, రోజ్‌గోల్డ్, స్టెర్లింగ్ సిల్వర్, ఫ్యాన్సీ రకాల్లోనూ వస్తున్నాయి. వివిధ సైజుల్లో దొరికే వీటిని అడ్జస్టబుల్ మాడల్స్లోనూ కొనుక్కోవచ్చు. ఒకే వేలికి రెండు ఉంగరాలు తొడుక్కోవచ్చు. ఉంగరం అంటే వేలి మొదట్లోనే ఎందుకుఉండాలి, చివరనా పెట్టుకోవచ్చు. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించవచ్చు! ఏకాంతంలో ఉన్నప్పుడు మాత్రం ‘ఇవి రెండూ నువ్వూ నేనూ’ అనుకుంటూ మురిసిపోనూవచ్చు!

Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran | బాలిస్టిక్ మిస్సైల్స్‌పై పరిమితిని ఎత్తేశాం.. ఇరాన్ కీలక ప్రకటన..!
Agriculture Student | మీరు ప్రొఫెసర్లా.. ప్రొఫెసర్ల ముసుగులో ఉన్న బ్రోకర్లా..? : అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థి ఫైర్.. వీడియో
Women Professor | ఒక్కొక్కరి పేర్లు బయటపెడ్తం.. వీసీ అల్డాస్ జానయ్య వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
Running Clubs | నగరాల్లో రన్నింగ్ క్లబ్‌లకు పెరుగుతున్న ప్రాధాన్యత.. అసలేంటివి.. ఎలాంటి లాభాలను అందిస్తాయి..?
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

