నిమ్మ రకాల్లో ఏ రకం శ్రేష్ఠమైనదో తెలుసా?

నిమ్మ తోటను పెంచాలని అనుకొంటున్నాను. ఏ రకం అయితే తెగుళ్లను, చీడపీడలను తట్టుకొని నిలబడుతుంది. అధిక దిగుబడిని అందజేస్తుందో తెలియజేయగలరు.
– సంజీవరెడ్డి, సూర్యాపేట.
నిమ్మ రకాల్లో ‘కాగ్జి’ రకం శ్రేష్ఠమైంది. అధిక దిగుబడిని ఇస్తుంది. ఒక్కో చెట్టు 3వేల నుంచి 5వేల దాకా కాయలు కాస్తుంది. ఒక్కో పండు 40 గ్రా. నుంచి 45 గ్రా. వరకు తూగుతుంది. అయితే, ఈ రకానికి తెగుళ్లు, చీడపీడలు సోకే అవకాశం ఎక్కువ. అయితే, నిమ్మ రైతులను ఎక్కువ ఇబ్బంది పెట్టేది గజ్జి తెగులు. దీనిని తట్టుకొనేలా తిరుపతిలోని చీనీ, నిమ్మ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు ‘బాలాజీ’ నిమ్మ రకాన్ని అభివృద్ధి చేశారు. ఇది గజ్జి తెగులుతోపాటు శిలీంధ్రాల ద్వారా వ్యాప్తిచెందే వేరుకుళ్లు తెగులును సమర్థంగా తట్టుకొని, అధిక దిగుబడిని ఇస్తుంది. తెలుగు రాష్ర్టాల్లో సాగయ్యే నిమ్మ తోటల్లో ఈ ఒక్క రకం వాటానే 50 శాతం దాకా ఉన్నది. ఉత్పత్తిలోనూ 60 శాతం వాటా ‘బాలాజీ’ రకానిదే. ‘పెల్టూరు సెలెక్షన్’ రకం కూడా గజ్జి తెగులును తట్టుకొంటుంది. అయితే, మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఉండే ‘బాలాజీ’ రకాన్ని సాగు చేయడం మంచిది.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- Cultivation
- farming
- Lemon
RELATED ARTICLES
తాజా వార్తలు
MLC Dasoju Shravan Kumar | పాత గుడ్డలతో తయారు చేసిన బెడ్ షీట్స్‌ను రేవంత్ రెడ్డి మనవడు కప్పుకుంటాడా..? : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
House Slab Collapses | కూలిన నిర్మాణంలో ఉన్న స్లాబ్.. ఒక కార్మికుడు మృతి, నలుగురికి గాయాలు
NZvIND: 4 రన్స్‌తో తేడాతో ఇండియా విజయం.. కివీస్‌తో వన్డే సిరీస్‌లో 2-0 ఆధిక్యం
Rajnath Singh | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సిబ్బందితో కలసి రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీపావళి వేడుకలు..!
నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి నిర్వహణపై మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

