Legal opinion | ఇంటిపేరు మార్చుకోను!

కొన్ని నెలల క్రితమే నాకు పెండ్లయింది. చిన్నప్పటి నుంచీ నా పేరులో ఓ భాగమైన ఇంటిపేరును మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. ఈ తంతు తప్పనిసరా? మార్చుకోకపోతే చట్టపరంగా ఇబ్బందులు ఎదురవుతాయా? అలాగే నేను, నా భర్త.. ఇద్దరమూ ఇంటిపేర్లను మార్చుకోవచ్చా? ఒకవేళ నేను నా పుట్టింటి ఇంటిపేరు మార్చుకోకపోతే, నా పిల్లలకు ఏ ఇంటిపేరు వస్తుంది? ఆ వచ్చిన ఇంటిపేరుతో భవిష్యత్‌లో పిల్లలకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయా? దయచేసి సలహా ఇవ్వండి.
ఓ సోదరి
జ : పెండ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవాలని చట్టపరంగా ఎక్కడా లేదు. పాస్‌పోర్ట్ మొదలైన వాటిలో మీ ఇంటిపేరును అలాగే ఉంచుకుని, ‘స్పౌస్’ అన్న కాలమ్‌లో మీ భర్త పేరు పెట్టుకుంటే సరిపోతుంది. అదే పెండ్లికి సాక్ష్యంగా ఉంటుంది. అలాగే మీరు, మీ భర్త ఒకరి ఇంటి పేరును ఇంకొకరు పెట్టుకోవాలనుకున్నా ఏ ఇబ్బందీ ఉండదు. ఐడెంటిటీ ప్రూఫ్‌లలో సాధారణంగా పేరు ఎలా మారుస్తారో, అదే పద్ధతిలో ఇంటిపేరును మార్చుకోవచ్చు. అయితే, పిల్లలకు ఎవరి ఇంటిపేరు ఉండాలన్న దానిపై భార్యాభర్తలిద్దరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవాలి. కావాలంటే ఇద్దరి ఇంటిపేర్లనూ వాళ్లకు పెట్టుకోవచ్చు. పెండ్లి తర్వాత ఇంటి పేరును మార్చుకొని తీరాలన్న చట్టం మనదేశంలో లేదన్న విషయాన్ని ప్రతి ఆడబిడ్డా తెలుసుకోవాలి. ఈ విషయంలో ఎవరైనా బలవంతం చేస్తే, వాళ్లపై కేసు పెట్టొచ్చు.
మానసి చౌదరి
అడ్వకేట్
www.pinklegal.in
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- legal opinion
- surname
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

