కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘నేను మీకు బాగా కావాల్సినవాడిని’. కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కోడి దివ్య దీప్తి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తీక్ శంకర్ దర్శకుడు. ఇటీవల ఈ సినిమా నుంచి లాయర్ పాప… అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ‘లాయర్ పాప..లవ్ జైల్లో ఉన్న..బెయిల్ ఇచ్చిపోరాదే’ అంటూ సాగుతుంది. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యాన్ని అందించగా..మణిశర్మ స్వరాలు కూర్చారు. రామ్ మిర్యాల పాడారు. కథానాయకుడు హీరోయిన్‌కు లవ్ ప్రపోజ్ చేసే సందర్భంలో ఈ పాట రానుంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో సిద్దార్థ్ మీనన్, ఎస్వీ కృష్ణారెడ్డి, బాబా భాస్కర్ తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.