పాన్ ఇండియా ‘యశోద’ ప్రారంభం

‘ఫ్యామిలీమెన్-2’ వెబ్‌సిరీస్ ద్వారా సమంత పాన్ ఇండియా తారగా అవతరించింది. ఆమె అభినయం దేశవ్యాప్తంగా సినీ ప్రియుల్ని మెప్పించింది. ప్రస్తుతం ఈ భామ భారీ అవకాశాల్ని అందిపుచ్చుకొంటూ దూసుకుపోతున్నది. ఈ నేపథ్యంలో సమంత నటిస్తున్న తాజా చిత్రం ‘యశోద’ రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి-హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘నాయికా ప్రధాన చిత్రమిది. థ్రిల్లర్ ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నాం. సమంత స్థాయికి తగిన అద్భుతమైన కథ కుదిరింది. డిసెంబర్ నుంచి మార్చి వరకు షూటింగ్‌కు ప్లాన్ చేస్తున్నాం. ఇతర తారాగణం వివరాల్ని త్వరలో తెలియజేస్తాం’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎం.సుకుమార్, ఆర్ట్: అశోక్, ఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సంగీతం: మణిశర్మ, పులగం చిన్నారాయణ, మాటలు: డా॥ చల్లా భాగ్యలక్ష్మి, సహనిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి-హరీష్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

