భారత్‌కు 70 మిలియన్ డాలర్ల సాయం : ఫైజర్
భారత్‌కు 70 మిలియన్ డాలర్ల సాయం : ఫైజర్ | గ్లోబల్ ఫార్మా మేజర్ దిగ్గజం ఫైజర్ అమెరికా, యూరప్, ఆసియాలోని పంపిణీ కేంద్రాల నుంచి 70 మిలియన్ డాలర్లు (రూ.510) కోట్లకుపైగా ఔషధాలను భారత్‌లోని కొవిడ్ ట్రీట్మెంట్ పోటోకాల్స్లో భాగంగా పంపనున్నట్లు కంపెనీ చైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం ప్రకటించారు.

న్యూఢిల్లీ : గ్లోబల్ ఫార్మా మేజర్ దిగ్గజం ఫైజర్ అమెరికా, యూరప్, ఆసియాలోని పంపిణీ కేంద్రాల నుంచి 70 మిలియన్ డాలర్లు (రూ.510) కోట్లకుపైగా ఔషధాలను భారత్‌లోని కొవిడ్ ట్రీట్మెంట్ పోటోకాల్స్లో భాగంగా పంపనున్నట్లు కంపెనీ చైర్మన్, సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా సోమవారం ప్రకటించారు. భారత ఉద్యోగులకు పంపిన మెయిల్లో విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా భారత్‌లో కరోనా విజృంభణపై తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మహమ్మారికి వ్యతిరేకంగా భారత్ చేసే పోరాటంలో భాగస్వాములయ్యేందుకు కట్టుబడి ఉన్నామని, కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద విరాళమని వెల్లడించారు.
ప్రస్తుతం యూఎస్, యూరప్ ఆసియాలోని పంపిణీ కేంద్రాల నుంచి ఔషధాలను వేగంగా పంపించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి కొవిడ్-19 రోగికి అవసరమైన మందులు ఉచితంగా పొందేలా విరాళంగా ఇస్తున్నట్లు బౌర్లా చెప్పారు. 70 మిలియన్ డాలర్ల కంటే విలువైన మందులు వెంటనే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పని చేస్తామని ఫైజర్ కంపెనీ సీఈవో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
Lychee : హైదరాబాద్‌లో ఎక్కడ చూసినా ఇవే పండ్లు? వీటి స్పెషల్ ఏంటి ?
భగ్గుమన్న బెంగాల్
రిటర్నింగ్ అధికారికి ప్రాణభయం
ఒక్క సీటీస్కాన్ 400 ఎక్స్‌రేలతో సమానం
లాక్డౌన్ అంశాన్ని పరిశీలించండి!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
Woman body in Pune flat | కుమార్తె లండన్‌లో చదువుతున్నదని భావించిన తల్లిదండ్రులు.. పూణే ఫ్లాట్‌లో ఆమె మృతదేహం
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

