సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం పాత దొమ్మాట గ్రామంలో చాళుక్యుల ఆనవాళ్లను గుర్తించినట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన పాత దొమ్మాట గ్రామంలో పర్యటించి పలు చారిత్రక ఆనవాళ్లను గుర్తించారు. వాగు ఒడ్డునగల పాత ఊరిలో గద్దెపై హనుమాన్ విగ్రహం ఉన్నదని, ఆ విగ్రహం ముందు పానపట్టం మీద శిరస్సు, వెనక లింగం ఉన్నట్టు గుర్తించినట్టు ఆయన పేర్కొన్నారు. – చేర్యాల