నాగశౌర్య కథానాయకుడిగా క్రీడా నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘లక్ష్య’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. డిసెంబర్ 10న విడుదలకానుంది. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను డిసెంబర్ 1న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఆదివారం కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో నాగశౌర్య శారీరక సాధన చేస్తూ శక్తివంతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన విలువిద్య క్రీడాకారుడి పాత్రను పోషిస్తున్నారు. ఇందుకోసం నాగశౌర్య ఆర్చరీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. లక్ష్యసాధనలో ఓ విలుకారుడికి ఎదురైన ప్రతిబంధకాలు, వాటిని అధిగమించి విజేతగా ఎలా నిలిచాడన్నదే కథాంశమని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. కేతికశర్మ, జగపతిబాబు, సచిన్ఖేడ్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రామ్‌రెడ్డి, సంగీతం: కాళభైరవ, నిర్మాతలు: నారాయణ్‌దాస్‌నారంగ్, పుస్కూర్ రామ్మోహన్రావు, శరత్‌మరార్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ధీరేంద్ర సంతోష్ జాగర్లపూడి.