ఆదాయ మార్గాలపై నిర్లక్ష్యమెందుకు?
హెచ్ఎండీఏ ఆదాయ మార్గాలను మరిచింది.బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు, లేక్ ఫ్రంట్ పార్క్, బోటింగ్, ఎన్టీఆర్ గార్డెన్, అంబేద్కర్ స్టాచ్యూ, లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా హెచ్ఎండీఏకు ఆదాయం తీసుకువచ్చే వేదికలే. కానీ గడిచిన ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో జరిగే నిర్మాణ పనులు, మరమ్మతుల కారణంగా లీజింగ్ జరగడం లేదు. దీంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది.
- రెవెన్యూ పెంచే ప్రాజెక్టులను పట్టించుకోని హెచ్ఎండీఏ
- ప్రధాన ఈవెంట్ వేదికలకు ఆదరణ కరువు
- వచ్చే15 రోజుల వరకు నో బుకింగ్స్
సిటీబ్యూరో: హెచ్ఎండీఏ ఆదాయ మార్గాలను మరిచింది.బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని సంజీవయ్య పార్క్, నెక్లెస్ రోడ్డు, లేక్ ఫ్రంట్ పార్క్, బోటింగ్, ఎన్టీఆర్ గార్డెన్, అంబేద్కర్ స్టాచ్యూ, లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కూడా హెచ్ఎండీఏకు ఆదాయం తీసుకువచ్చే వేదికలే. కానీ గడిచిన ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో జరిగే నిర్మాణ పనులు, మరమ్మతుల కారణంగా లీజింగ్ జరగడం లేదు. దీంతో ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తోంది. గతంలో సినిమా షూటింగ్‌లు, సమావేశాలు, గెట్ టు గెదర్ మీటింగ్‌లు, ఈవెంట్ల పేరిట ఎప్పుడూ బుకింగ్ నిండిపోయి ఉండేవి. కానీ ఇటీవల కాలంగా బీపీపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బుకింగ్స్ రావడం లేదని తెలిసింది.
ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి ఆన్లైన్లోనే అనుమతులు పొందే అవకాశాన్ని బీపీపీ ఏర్పాటు చేసింది. ఇందులో తేదీల వారీగా, ట్యాంక్ బండ్ నుంచి లేక్ ఫ్రంట్ పార్క్ వరకు అన్ని వేదికలు ఆన్లైన్లో కనిపిస్తాయి. కానీ వచ్చే 15 రోజుల వరకు ఏ ఒక్క వేదికలో కూడా బుకింగ్స్ జరగలేదని తేలింది. దీనికి ప్రధాన కారణం గతంలో కంటే అధ్వానంగా నిర్వహణ ఉండటంతోనేనని, వినియోగదారులకు అనువైన మౌలిక వసతులు లేకపోవడంతోనే బీపీపీ పరిధిలో ఉన్న ఈవెంట్ వేదికలకు ఆదరణ రావడం లేదని తెలుస్తున్నది.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్యాంక్ బండ్‌పై కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలు ఉండగా… ఒక్కో కార్యక్రమానికి రూ. 10వేల నుంచి లక్ష వరకు చార్జీల రూపంలో హెచ్ఎండీఏకు వస్తుంది. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అదనపు ఆదాయాన్ని హెచ్ఎండీఏ కోల్పోతున్నది. డిసెంబర్ 31 వరకు వేదికలన్నీ కూడా ఖాళీగానే ఉండగా… బుకింగ్స్‌ను ఆకర్షించడంలో అధిక ధరలు కూడా కారణమని, మరమ్మతుల పేరిట ఏటా టెండర్ల వ్యవహారం నడిపిస్తున్నారే తప్ప.. కనీస మౌలిక వసతులు ఆయా వేదికల్లో ఉండటం లేదని కొందరు గతంలో బుకింగ్ చేసుకున్న ఈవెంట్ ఆర్గనైజర్లు తెలిపారు. అంతకంటే తక్కువ ఖర్చుతో నగరంలో ఎన్నో వేదికలు అందుబాటులో ఉన్నాయంటున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
Medak | మెదక్ జిల్లాలో హైవేపై లారీ బోల్తా.. 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!
Mary Millben: కాక్రోచ్ జనతా పార్టీకి అమెరికా నుంచి నిధులు: సింగర్ మేరీ మిల్బెన్ ఆరోపణ
Liquor Price | మందుబాబులకు షాక్.. తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరల పెంపు..!
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

