కిరణ్ బేడి.. పరిచయం అవసరంలేని పేరు. తొలి మహిళా ఐపీఎస్ అధికారి. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. సామాజిక ఉద్యమాల్లోనూ చురుకైన భాగస్వామి. కెరీర్ విజయానికి ఆమె సూచిస్తున్న ఐదు సూత్రాలు..
ప్రణాళికతో ముందుకెళ్లండి.
మీ జీవన లక్ష్యం ఏమిటి? దాన్ని సాధించాలంటే ఏం చేయాలి? అనే అంశంపై ప్రణాళిక రూపొందించుకోండి. మీ ప్రయత్నాన్ని చిన్నచిన్న భాగాలుగా విడదీయండి.
కంఫర్ట్ జోన్ నుంచి బయటికి.
మిమ్మల్ని మీరు సవాలు చేసుకోగలిగితేనే ఘన ఫలితాలు సొంతం అవుతాయి. శక్తిసామర్థ్యాలూ వెలుగులోకి వస్తాయి.
భావసారూప్యం ఉన్న వ్యక్తుల మధ్య గడపండి.
మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తుల మధ్య గడపండి. ఆ సామీప్యం మీకు ప్రేరణ కలిగిస్తుంది. చుట్టూ సానుకూల భావాలు కలిగిన వ్యక్తులు ఉండేలా చూసుకోండి.
ప్రాధాన్యం లేని అంశాలను విస్మరించండి.
మీ ఆలోచనలెప్పుడూ లక్ష్యం వైపే ఉండాలి. అనవసర విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి సమయాన్ని వృథా చేసుకోకండి. చిన్నచిన్నఅవాంతరాలు ఎదురైనా పట్టించుకోకండి.
నేర్చుకుంటూనే ఉండండి.
నేర్చుకోవడం ఆపేస్తే.. మరణించినట్టు లెక్క. అందుకే కొత్త విషయాలు తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూ ఉండండి.