త్రిగుణ్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న సినిమా ‘కథ కంచికి మనం ఇంటికి’. చాణిక్య చిన్న దర్శకత్వం వహిస్తున్నారు. ఎంపీ ఆర్ట్స్ పతాకంపై మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు. హారర్ కామెడీతో సినిమా తెరకెక్కించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తున్నది. ‘ప్రేమకథను హారర్ కామెడీతో మేళవించి సినిమాను రూపొందించాం. సినిమా ఆద్యంతం నవ్విస్తూ సాగుతుంది’ అన్నారు దర్శకుడు. మార్చ్ 18న విడుదలకానుంది.