శివమెత్తి అలల పడగెత్తినదే..
పవర్ఫుల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ‘కేజీఎఫ్’ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్-2’ ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. యష్ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. భారీ నిర్మాణ హంగులు, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిస్తున్న ఈ సీక్వెల్ కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదల తేదీ సమీపిస్తుండటంతో ప్రచార కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు. తొలిగీతం ‘తుఫాన్’ను సోమవారం విడుదల చేశారు. కథానాయకుడి పాత్ర స్వభావాన్ని, ధీరత్వాన్ని వర్ణిస్తూ ఈ పాట సాగింది. ‘తుఫాన్..తుఫాన్..ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే..శివమెత్తి అలల పడగెత్తినదే’ అంటూ రోమాంచితమైన విజువల్స్‌తో పాట ఆకట్టుకుంది. ఈ గీతానికి రవి స్వరాల్ని అందించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

