Kerala State Film Awards | కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్
Prithviraj Sukumaran | 'ఎల్2 ఎంపురాన్' సినిమాతో ఒకవైపు దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు.
Prithviraj Sukumaran | ‘ఎల్2 ఎంపురాన్’ సినిమాతో ఒకవైపు దర్శకుడిగా బ్లాక్ బస్టర్ అందుకున్న మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తాజాగా మరో ఘనతను అందుకున్నాడు. కేరళ సినీ నటులు ప్రతిష్టాత్మకంగా భావించే కేరళ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ 54వ వేడుకలు కేరళలోని తిరువనంతపురంలో ఘనంగా జరుగగా.. ఈ వేడుకలలో ఉత్తమ నటుడిగా పృథ్వీరాజ్ సుకుమారన్ కేరళ సీఎం పినరయి విజయన్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ‘ఆడు జీవితం (ది గోట్‌లైఫ్)’ చిత్రానికి గాను ఈ అవార్డును అందుకున్నాడు పృథ్వీరాజ్. ఉత్తమ నటిగా సినీయర్ నటి ఊర్వశితో పాటు నటి బీనా ఆర్ చంద్రన్ అవార్డును అందుకోగా.. ఉత్తమ చిత్రంగా మమ్ముట్టి నటించిన కాథల్ ది కోర్ చిత్రం అవార్డును అందుకుంది. మరోవైపు ది గోట్‌లైఫ్ చిత్రం ఏకంగా 9 అవార్డులు గెలుచుకుంది.
అవార్డులు అందుకున్న విజేతల జాబితా ఇదే..
ఉత్తమ చిత్రం – కాథల్ ది కోర్
ఉత్తమ నటి – ఊర్వశి (ఉల్లోఝుక్కు), బీనా ఆర్ చంద్రన్ (తడవు)
ఉత్తమ నటుడు – పృథ్వీరాజ్ సుకుమారన్ (ఆడుజీవితం)
ఉత్తమ దర్శకుడు – బ్లెస్సీ (ఆడుజీవితం)
ఉత్తమ ద్వితీయ చిత్రం – ఇరట్ట (రోహిత్ ఎంజీ కృష్ణన్)
ఉత్తమ బాల నటి – తెన్నల్ అభిలాష్ – శేషం మైకిల్ ఫాతిమా
ఉత్తమ బాల నటుడు – అవిర్త్ మీనన్ – పచువుం అద్భుత విళక్కుం
ఉత్తమ సహాయ నటి – శ్రీష్మా చంద్రన్ (పొంబళై ఒరుమై)
ఉత్తమ సహాయ నటుడు – విజయరాఘవన్ (పూక్కాలం)
ఉత్తమ నేపథ్య గాయకుడు (పురుషుడు) – విద్యాధరన్ మాస్టర్ (జననం 1947 ప్రణయం తుడురున్ను)
ఉత్తమ నేపథ్య సంగీతం – మాథ్యూస్ పులిక్కల్ (కాథల్: ది కోర్)
ఉత్తమ సంగీత దర్శకుడు – జస్టిన్ వర్గీస్ (చావేర్)
ఉత్తమ అనువాదిత స్క్రీన్ ప్లే – బ్లెస్సీ (ఆడుజీవితం)
ఉత్తమ నూతన దర్శకుడు – ఫాజిల్ రజాక్
ఉత్తమ డబ్బింగ్ కళాకారుడు (పురుషుడు) – రోషన్ మాథ్యూ (ఉల్లోఝుక్కు)
ఉత్తమ డబ్బింగ్ కళాకారిణి (స్త్రీ) – సుమంగళ (స్త్రీ – జననం 1947 ప్రణయం తుడురున్ను)
ఉత్తమ దుస్తుధారణ – ఫెమినా జబ్బార్ (ఓ. బేబీ)
ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ ప్లే – రోహిత్ ఎంజీ కృష్ణన్ (ఇరట్ట)
ఉత్తమ సాహిత్యం – హరీష్ మోహనన్ (చెంతామర పూవిల్ – చావేర్)
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ – రంజిత్ అంబాడి (ఆడుజీవితం)
ఉత్తమ సౌండ్ రికార్డింగ్ – జయదేవన్ చక్కడత్, అనిల్ దేవన్ (ఉల్లోఝుక్కు)
ఉత్తమ ఎడిటింగ్ – సంగీత్ ప్రతాప్ (లిటిల్ మిస్ రావ్థర్)
ఉత్తమ సౌండ్ మిక్సింగ్ – రసూల్ పూక్కుట్టి, శరత్ మోహన్ (ఆడుజీవితం)
ఉత్తమ సౌండ్ డిజైన్ – జయదేవన్ చక్కడత్, అనిల్ రాధాకృష్ణన్ (ఉల్లోఝుక్కు)
ఉత్తమ కళా దర్శకత్వం – మోహన్ దాస్ (2018) ఫాజిల్ రజాక్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ – ఆండ్రూ డి క్రూజ్, విశాక్ బాబు (2018)
ఉత్తమ నృత్య దర్శకుడు – జిష్ణు (సులేఖ మంజిల్)
ఉత్తమ ప్రాసెసింగ్ ల్యాబ్/కలరిస్ట్ – వైశాల్, శివ గణేష్ (ఆడుజీవితం)
మహిళలు/ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల కోసం ప్రత్యేక జ్యూరీ అవార్డు – దర్శకురాలు షాలిని ఉషాదేవి (ఎన్నెన్నుమ్)
సినిమా కళ యొక్క ఏదైనా అంశంలో అత్యుత్తమ ప్రతిభకు ప్రత్యేక అవార్డు – గగనచారి
ఉత్తమ సాహిత్య రచన – మళవిల్ కన్నిలూడే సినిమా
ప్రత్యేక ప్రస్తావన – కెఆర్ గోకుల్ (ఆడుజీవితం)
ప్రత్యేక ప్రస్తావన – కృష్ణన్ (జైవం)
ప్రత్యేక ప్రస్తావన – సుధి కోజికోడ్ (కాథల్: ది కోర్)
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

