కథ కంచికి మనం ఇంటికి
ఆదిత్ అరుణ్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం ‘కథ కంచికి మనం ఇంటికి’. చాణక్య చిన్న దర్శకత్వంలో మోనిష్ పత్తిపాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘కామెడీ జోనర్లో చాలా కొత్త కథ ఇది. ఆద్యంతం వినోదప్రధానంగా ఆకట్టుకుంటుంది. ఓ జంట ప్రేమ ప్రయాణం అనుకోని సంఘటనల వల్ల అనూహ్యమైన మలుపులు తీసుకుంటుంది. అదేమిటన్నదే ఆసక్తికరంగా ఉంటుంది. వినోదం, హారర్ అంశాలతో ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది’ అన్నారు. ‘హారర్ జోనర్లో ఓ విభిన్న కథా చిత్రమిది. ఆర్జే హేమంత్, గెటప్ శ్రీను మధ్య నడిచే కామెడీ ప్రధానాకర్షణగా నిలుస్తుంది. థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం’ అని నిర్మాత తెలిపారు. మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్‌కుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వై.యస్.కృష్ణ, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సంభాషణలు: శ్రీనివాస్ తేజ, దర్శకత్వం: చాణక్య చిన్న.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
Horoscope | 24-10-2026 శనివారం.. మీ రాశి ఫలాలు
కాళేశ్వరాన్ని తిట్టి.. కరువులోకి నెట్టి.. కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే రాష్ర్టానికి దుర్భిక్షం
రఘునందన్ కృషి స్ఫూర్తిదాయకం.. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటయ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

