మూడు భాషల్లో ‘హృదయం’
ఇటీవల మలయాళంలో విడుదలైన ప్రేమకథా చిత్రం ‘హృదయం’ భారీ విజయాన్ని దక్కించుకుంది. మోహన్‌లాల్ తనయుడు ప్రణవ్ మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా నటించిన ఈ చిత్రం హృద్యమైన ప్రణయగాథగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కాలేజీ రోజుల నుంచి వైవాహిక బంధం వరకు ఓ యువకుడి భావోద్వేగభరిత జీవిత ప్రయాణానికి అందమైన దృశ్యరూపంగా నిలిచింది. తాజాగా ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల రీమేక్ హక్కుల్ని ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌జోహార్ సొంతం చేసుకున్నారు. ధర్మ ప్రొడక్షన్స్, ఫాక్స్‌స్టార్ స్టూడియోస్ పతాకాలపై ఆయన ఈ సినిమాను హిందీ, తమిళ, తెలుగు భాషల్లో పునర్నిర్మించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘న్యూ ఏజ్ లవ్‌స్టోరీ ‘హృదయం’ రీమేక్ హక్కుల్ని పొందడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రీమేక్ చేయబోతున్నాం’ అని కరణ్‌జోహార్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన రణ్‌వీర్‌సింగ్, ఆలియాభట్ నాయకానాయికలుగా ‘రాకీ ఔర్ రాణికీ ప్రేమ్ కహానీ’ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

