తమిళ నటుడు విష్ణువిశాల్, మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ జ్వాలా గుత్తా త్వరలో పెండ్లి పీటలెక్కబోతున్నారు. అరణ్య ప్రీ రిలీజ్ ఈవెంట్లో విష్ణువిశాల్ పెండ్లిపై ప్రకటన చేశాడు. ‘సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జ్వాలా గుత్తా నాకు చాలా సపోర్టుగా నిలిచింది. మూవీ లొకేషన్ లో కూడా జ్వాలా నాతోపాటే ఉంది. మేమిద్దరం పెండ్లి చేసుకోబోతున్నాం. త్వరలో వివాహం తేదీని ప్రకటిస్తామని చెప్పాడు. తాను త్వరలో తెలుగు అల్లుడు కాబోతున్నట్టు’ చెప్పాడు.
జ్వాలా, విష్ణువిశాల్ గడిచిన కొన్ని నెలలుగా పలు పంక్షన్లలో కలుస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జ్వాలా గుత్తా సోదరి వివాహం కోసం విష్ణు విశాల్ హైదరాబాద్లో ఉన్నాడు. విష్ణు విశాల్ అరణ్య ప్రాజెక్టుపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. తాను నటించిన 3 తమిళ సినిమాలను తెలుగులో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పాడు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.