Oppenheimer | కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో (PM Justin Trudeau), సోఫీ గ్రెగోయ్రీ ట్రుడో (Sophie Gregoire) దంపతులు విడిపోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తమ 18 ఏండ్ల వైవాహిక బంధానికి వీడ్కోలు పలుకుతున్నట్లు చెప్పారు. పలుమార్లు చర్చించుకున్న తర్వాతే తాము విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఇక వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన అనంతరం ట్రుడో తన పిల్లలతో ఎక్కువ సమయం గడుపుతున్నాడు. తాజాగా జస్టిన్ ట్రుడో ఓపెన్హైమర్కి మూవీకి తన కూతురుతో కలిసి వెళ్ళాడు.
జస్టిన్ ట్రూడో (Canada PM Justin Trudeau) తన కూతురు ఎల్లా(Ella) తో కలిసి ఓపెన్హైమర్ (Oppenheimer) మూవీ చూడటానికి వెళ్ళాడు. ఈ విషయాన్ని ట్రూడో సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. ఓపెన్హైమర్ మూవీకి ఎల్లాతో వచ్చాను. వైవాహిక బంధానికి వీడ్కోలు పలికిన అనంతరం కుటుంబ విషయాలను బ్యాలెన్స్ చేస్తున్న అంటూ రాసుకోచ్చారు. కాగా గత సోమవారం తన కొడుకు జేవియర్ (Xavier) తో కలిసి ట్రుడో బార్బీ (Barbie) సినిమాకి వెళ్లిన విషయం తెలిసిందే.
Balancing things out: Oppenheimer with Ella. pic.twitter.com/MdcZlhDwaG
— Justin Trudeau (@JustinTrudeau) August 9, 2023
We’re team Barbie. pic.twitter.com/bdwhuTUHxM
— Justin Trudeau (@JustinTrudeau) August 6, 2023
2005, మే నెలలో జస్టిన్ ట్రుడో, సోఫీ గ్రెగోయ్రీ వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం విడిపోతున్నప్పటికీ వారి సంరక్షణను తామిద్దరం కలిసే చూసుంటామని ట్రుడో దంపతులు వెల్లడించారు. ఎప్పటిలాగానే తమ మధ్య ప్రేమ, పరస్పర గౌరవం ఉంటాయని తెలిపారు.