‘ఎవరు మీలో కోటీశ్వరుడు’ అంటున్న జూనియర్ ఎన్టీఆర్

ఎవరు మీలో కోటీశ్వరుడు ఏంటి..మీలో ఎవరు కోటీశ్వరుడు కదా అనుకుంటున్నారా..? అది నాగార్జున.. ఇది జూనియర్ ఎన్టీఆర్. ఈయన చాలా ఏండ్ల తర్వాత మళ్లీ బుల్లితెరకు వచ్చేస్తున్నాడు. త్వరలోనే జూనియర్ మళ్లీ బుల్లితెరపై తన విశ్వరూపం చూపించబోతున్నాడు. ఎన్టీఆర్ కు బుల్లితెర కొత్తేం కాదు.. హీరోగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలోనే బిగ్ బాస్ సీజన్ 1 హోస్ట్ చేసాడు. అది కాస్తా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత మళ్లీ బుల్లితెరపై కనిపించలేదు జూనియర్. ఇన్నేళ్లకు రీ ఎంట్రీ ఇస్తున్నాడు. ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ వచ్చేస్తున్నాడు తారక్. నాగార్జున ప్రోగ్రామ్ నే కాస్త మార్చి ఇది తీసుకొస్తున్నారు.
అన్నపూర్ణ 7ఎకర్స్‌లో దీనికి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా జరుగుతుంది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దీన్ని షూట్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. మూడు నాలుగు రోజుల్లో ఈ ప్రోమో షూట్ పూర్తి కానుంది. ఓ ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్లో ఏప్రిల్ నుంచి ఈ ప్రోగ్రామ్ ప్రారంభం కానుంది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రామ్ బాగా ప్రజాదరణ పొందడంతో దాన్ని కాస్త మార్చి ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ తీసుకొస్తున్నారు. మార్చి తొలివారం నుంచి ఈ షోకి సంబంధించి ఎంట్రీస్ తీసుకుంటారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుంది. తన సినిమాలతో పాటు ఈ షోకు కూడా డేట్స్ ఇచ్చేసాడు జూనియర్.
ఒక్కో ఎపిసోడ్ కోసం కోటికి పైగానే రెమ్యునరేషన్ తీసుకోబోతున్నాడు తారక్. కరోనా కారణంగా గతేడాదే మొదలవ్వాల్సిన ఈ షో ఇప్పుడు బయటికి వస్తుంది. ఎంటర్టైన్మెంట్ ప్లస్ నాలెడ్జ్ కూడా ఉండటంతో కచ్చితంగా ఈ షో మంచి సక్సెస్ అవుతుందని నమ్ముతున్నారు నిర్వాహకులు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. షోను కూడా భారీ స్థాయిలోనే లాంఛ్ చేయబోతున్నారు. మరి జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను ఎంతవరకు సక్సెస్ చేస్తాడో చూడాలిక.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
Siddipet | ఎనిమిది నెలలుగా మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్ లైంగిక దాడి.. దసరా వేళ వెలుగులోకి!
Rice Price | కిలో బియ్యం రూ.100 దాటనుందా? నెల రోజుల్లోనే 35 శాతం పెరిగిన సన్నబియ్యం ధరలు!
Rahul Sankrityan | ‘రణబాలి’పై నెగెటివ్ ప్రచారం చేశారు.. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ సంచలన వ్యాఖ్యలు!
Paris Shooting: పారిస్‌లో రేసిస్ట్ అటాక్.. ఒకరు మృతి, అయిదుగురికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

