Health tips | జొన్నలు మధుమేహులకే కాదు, హృద్రోగులకూ మేలు చేస్తాయి.. ఎలాగంటే..!
Health tips : ఆరోగ్యం బాగుండాలంటే చిరుధాన్యాలకు మించిన ప్రత్యామ్నాయం లేదు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక రోగుల సంఖ్య ఏటికేడు పెరిగిపోతుండటంతో చిరుధాన్యాలకు డిమాండ్ ఏర్పడింది. ముఖ్యంగా కొర్రలు, అరికలు, జొన్నలు, రాగులు, సజ్జలు వంటి వాటిని జనం ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటిలో అన్నింటి కంటే ఎక్కువ ప్రయోజనకరమైనవి, మిగతావాటితో పోల్చితే తక్కువ ధరకు లభ్యమయ్యేవి జొన్నలు (Jowar) మాత్రమే. జొన్నలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో తెలుసుకుందాం..

జొన్నలతో లాభాలు..
1. జొన్నలతో చేసే ఏ పదార్థమైనా బలవర్ధకమైనదే. బియ్యం, గోధుమలతో పోల్చితే జొన్నల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. రోజూ జొన్నపిండితో చేసిన రొట్టెలు తినడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అదేవిధంగా జొన్న గటక, జొన్న జావ, జొన్న అన్నం ఇలా ఏ రకంగా తీసుకున్నా జొన్నలతో మేలే జరుగుతుంది.
2. జొన్నల్లో ఇనుము, ప్రోటీన్లు, పీచు పదార్ధాల్లాంటి పోషకాలు ఎక్కువ. కాబట్టి గుండె జబ్బులు రాకుండా అడ్డుకునే గుణం జొన్నల్లో ఉంది. గుండె జబ్బులు ఉన్నవాళ్లకు కూడా సమస్య తీవ్రం కాకుండా చూడటంలో జొన్నలు తోడ్పడుతాయి.
3. ఆరోగ్యానికి కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్స్ జొన్నల్లో పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఉండే చెడు కొవ్వును తగ్గించే శక్తి జొన్నలకు ఉంది.
4. ఎముకలను బలిష్టంగా ఉంచేందుకు కావాల్సిన ఫాస్పరస్ జొన్నల్లో లభిస్తుంది. నరాల బలహీనతను తగ్గించే గుణం కూడా జొన్నలకు ఉంది.
5. రోజూ జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడంవల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వయసు పెరిగేకొద్దీ వచ్చే మతిమరుపు, కంటిచూపు మందగించడం లాంటి సమస్యలు కూడా జొన్నలు ఎక్కువగా వాడటంవల్ల తగ్గుతాయి.
6. జొన్నల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణశక్తి పెంపొందుతుంది. జొన్నలు ఆహారంగా తీసుకోవడంవల్ల జీర్ణశక్తికి కావాల్సిన హార్మోన్లు కూడా వృద్ధి చెందుతాయి.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!