రాంచీ: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై.. ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల సంఘం అనర్హత లేఖను గవర్నర్‌కు పంపినట్లు కొన్ని నివేదికలు వస్తున్నాయి. దీనిపై సీఎం సోరెన్ స్పందిస్తూ.. తనకు ఎటువంటి సమాచారం లేదన్నారు. బీజేపీయే ఆ డ్రాఫ్ట్‌ను తయారు చేసినట్లు సీఎం హేమంత్ ఆరోపించారు. తాము వేసిన పిల్లో సక్సెస్ అయ్యామని, నైతిక కారణాలను చూపుతూ మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అయితే ఎన్నికల సంఘం తన లేఖలో ఏం చెప్పిందో ఇంకా స్పష్టంగా తెలియదు. అక్రమ రీతిలో మైనింగ్ లీజుకు సోరెన్ అనుమతి ఇచ్చినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఆ కేసులో సోరెన్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించాలని పిల్ దాఖలైంది.