వాషింగ్టన్: ఆవ నూనె (బ్రాస్సికా కారినాటా) నుంచి జెట్ ఇంధనాన్ని తయారు చేయవచ్చని, ఇది ప్రస్తుతం వాడుతున్న ఇంధనంతో పోల్చితే కర్బన ఉద్గారాలను 68% తగ్గిస్తుందని భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త పునీత్ ద్వివేది నేతృత్వంలోని బృందం నిర్వహించిన పరిశోధనల్లో తేలింది. పెట్రోలియం ఉత్పత్తులతో తయారు చేస్తున్న ఇంధన ధర లీటర్కు రూ.38 దాకా ఉండగా, ఆవ నూనె నుంచి తయారు చేసిన ఇంధనం రేటు రూ.15 కూడా ఉండదన్నారు.