లాస్ వెగాస్: హాలీవుడ్ స్టార్ హీరో బెన్ అఫ్లెక్‌ను జెన్నిఫర్ లోపేజ్ పెళ్లి చేసుకుంది. లాస్ వెగాస్‌లో ఆ ఇద్దరూ ఒక్కటయ్యారు. జెన్నిఫర్ తన ఫ్యాన్ పేజీ వెబ్సైట్లో ఈ విషయాన్ని తెలిపింది. ప్రేమ ఎంతో అందమైందని, కరుణతో కూడున్నదని, ప్రేమకు ఉన్న సహనం గొప్పదని, 20 ఏళ్లు ఓపిగ్గా ఉన్నామని తన ఫ్యాన్ పేజీలో జెన్నిఫర్ రాసింది. నిజానికి 2004 జనవరిలో ఆ ఇద్దరూ తొలిసారి ఎంగేజ్ అయ్యారు. అయితే ఆ ఇద్దరూ మళ్లీ ఒక్కటవుతున్నారని గత ఏడాది నుంచి వార్తలు గుప్పుమంటున్నాయి. సోషల్ మీడియాలో ఆ ఇద్దరూ ఇటీవల ఫోటోలతో అందర్నీ అట్రాక్ట్ చేశారు. లోపేజ్ తన పేరును జెన్నిఫర్ అఫ్లెక్గా మార్చాలని అభ్యర్థన పెట్టుకున్నట్లు తెలుస్తోంది.