Akhil | జపాన్‌లో అఖిల్ అక్కినేనికి ఘన స్వాగతం.. తెలుగులో స్పెషల్ స్కెచ్‌లు,నాగార్జునకు కూడా ప్రత్యేక విషెస్!
Akhil |టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్లో మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవల ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్‌ను సొంతం చేసుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అఖిల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమాను జపాన్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అఖిల్ జపాన్ పర్యటన ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Akhil |టాలీవుడ్ యువ హీరో అఖిల్ అక్కినేని ప్రస్తుతం తన కెరీర్లో మంచి జోష్‌లో ఉన్నారు. ఇటీవల ‘లెనిన్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకుని తన కెరీర్లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్‌ను సొంతం చేసుకున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో పాటు అఖిల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇక ఈ సినిమాను జపాన్‌లో కూడా గ్రాండ్‌గా విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అఖిల్ జపాన్ పర్యటన ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.తాజాగా అఖిల్ అక్కినేని జపాన్‌కు చేరుకోగా, అక్కడి అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు. ముఖ్యంగా జపాన్ ప్రేక్షకులు అఖిల్‌పై చూపిస్తున్న అభిమానం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రత్యేకమైన స్కెచ్‌లు, ఆర్ట్‌వర్క్‌లతో అఖిల్‌కు స్వాగతం చెబుతూ అభిమానులు సందడి చేస్తున్నారు. అంతేకాదు, అక్కినేని కుటుంబంపై తమకున్న అభిమానాన్ని కూడా ప్రత్యేకంగా చాటుకుంటున్నారు.
ఈ క్రమంలో అఖిల్‌తో పాటు ఆయన తండ్రి, టాలీవుడ్ కింగ్ నాగార్జునకు కూడా జపాన్ అభిమానులు ప్రత్యేకంగా విషెస్ తెలియజేయడం విశేషం. అఖిల్, నాగార్జున చిత్రాలతో రూపొందించిన అందమైన స్కెచ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన అక్కినేని అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్నింటికంటే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జపాన్ ప్రేక్షకులకు తెలుగు భాషపై కూడా మంచి అభిమానం ఉంది. అఖిల్‌కు స్వాగతం చెబుతూ ఓ అభిమాని అచ్చమైన తెలుగులో ‘అఖిల్ గారు జపాన్‌కు స్వాగతం’ అంటూ ఎంతో అందమైన చేతిరాతతో ప్రత్యేకంగా స్కెచ్ రూపొందించారు. జపాన్‌లో ఉంటూ తెలుగు భాషలో ఇంత చక్కగా స్వాగత సందేశం రాయడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఈ స్కెచ్ ఇప్పుడు నెట్టింట ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
మరోవైపు జపాన్ అభిమానులు అందించిన ఈ ప్రత్యేక కానుకలను అఖిల్ స్వయంగా చూస్తున్న ఫొటోలను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు అక్కినేని అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఒక తెలుగు హీరోకు విదేశాల్లో, ముఖ్యంగా జపాన్‌లో ఈ స్థాయిలో ఆదరణ లభించడం విశేషంగా మారింది.గతంలోనూ జపాన్ ప్రేక్షకులు తెలుగు సినిమాలపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ సినిమాలకు అక్కడ మంచి గుర్తింపు రావడంతో తెలుగు హీరోలకు కూడా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడుతోంది. ఇప్పుడు అఖిల్ ‘లెనిన్’ సినిమాతో జపాన్ ప్రేక్షకులను పలకరించబోతుండటంతో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
An overwhelming show of love for #AkhilAkkineni from Japan! ❤️🇯🇵
From heartfelt messages to beautifully hand-drawn portraits, Japanese fans made this visit truly memorable with their warmth and affection. ❤️
#Lenin #LeninInJapan releasing on Dec 11th.
Release by @indo_eiga
https://t.co/mTpG1kWnt9@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman @pramodactor1 @NavinNooli @artkolla @leonbrittodp @AnnapurnaStdios #ManamEnterprisesLLP @SitharaEnts
— Sithara Entertainments (@SitharaEnts) November 28, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Akhil
- double climax
- Japan
- Lenin
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhil | జపాన్‌లో అఖిల్ అక్కినేనికి ఘన స్వాగతం.. తెలుగులో స్పెషల్ స్కెచ్‌లు,నాగార్జునకు కూడా ప్రత్యేక విషెస్!
Crime news | పెరూలో కారులో వెళ్తున్న భారతీయుడిపై కాల్పులు.. భారీ దారి దోపిడీ.. Video
Congress Leader | మనుషులా.. గాడిదలా..? విద్యుత్ సిబ్బందిపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అనుచరుడి హంగామా
Bhogi | శర్వానంద్ ‘భోగి’ తొలి రోజు కలెక్షన్స్.. మిక్స్డ్ టాక్‌తో ఎంత వసూలు చేసిందంటే?
చిన్న అంజయ్యకు మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పరామర్శ
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

