ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ సినిమా ట్రైలర్ వచ్చేసింది. తెలుగులోనూ విడుదలైన ఈ ట్రైలర్ హై వోల్టేజ్ యాక్షన్‌తో రజనీ మార్క్ ైస్టెల్, కామెడీ, యాటిడ్యూడ్తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచింది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ తనదైన శైలిలో ‘జైలర్’ ప్రపంచాన్ని మరింత భారీగా, మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్దినట్టు ట్రైలర్ చెబుతున్నది. జైలర్ ముత్తవేల్ పాండియన్‌గా తలైవా మరోసారి తనదైన ైస్టెల్, మాస్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు.
ఈ సీక్వెల్ మరింత సంఘర్షణలతో, భారీ సవాళ్లతో విస్తృతమైన ప్రపంచాన్ని ఆవిష్కరించనున్నదని మేకర్స్ చెబుతున్నారు. మోహన్‌లాల్, శివరాజ్‌కుమార్ ప్రత్యేక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, విద్యాబాలన్ కథానాయికలు. ఎస్.జె.సూర్య, యోగిబాబు, సూరజ్ వెంజారమూడు ఇతర పాత్రధారులు. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ తెలుగులో విడుదల చేయనున్నది. ఈ నెల 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ పాన్ ఇండియా చిత్రానికి కెమెరా: కార్తీక్ కన్నన్, సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్.