LSG vs PBKS : ఎట్టకేలకు లీగ్ దశ ఆఖరి మ్యాచ్‌లో విజయంతో పంజాబ్ కింగ్స్(Punjab Kings) ఊపిరి పీల్చుకుంది. వరసగా ఆరు ఓటములతో ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్షిష్టంగా మారిన వేళ లక్నో సూపర్ జెయింట్స్ (LSG)పై భారీ విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 197 పరుగుల ఛేదనలో ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్(69) అర్ధ శతకంతో మెరవగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(101 నాటౌట్) తొలి శతకంతో కదం తొక్కాడు. ప్రత్యర్థి బౌలర్లను ఎడాపెడా ఉతికేసిన ఈ ద్వయం శతక భాగస్వామ్యంతో విజయానికి బాటలేసింది. మొత్తంగా ఏడో విజయం.. 5 పాయింట్లతో మూడో నాలుగో స్థానంలోకి దూసుకెళ్లింది పంజాబ్.
పంతొమ్మిదో సీజన్లో పంజాబ్ కింగ్స్ అదిరే విజయంతో లక్నోకు భారీ స్కోర్ కొట్టనిచ్చిన పంజాబ్ కింగ్స్‌కు ఆదిలోనే షమీ షాకిచ్చాడు. తొలి బంతికే అర్జున్ టెండూల్కర్ క్యాచ్ పట్టడంతో ప్రియాన్ష్ ఆర్య(0) ఔటయ్యాడు. ఆ తర్వాతి ఓవర్లో కూపర్ కొన్నొల్లి(18)ని బౌల్డ్ చేసిన రెండో వికెట్ అందించాడు షమీ. వెంటవెంటనే కీలక వికెట్లు పడడంత ప్రభ్‌సిమ్రన్ సింగ్(69), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(101 నాటౌట్ : 51 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు)లు ఆచితూచి ఆడారు. రథ్వీ ఓవర్లో ఫోర్, సిక్సర్‌తో రన్స్ రాబట్టగా పంజాబ్ పవర్ ప్లేలో 65 పరుగులు చేసింది.
𝙎𝙝𝙧𝙚𝙮𝙖𝙨 𝙎𝙥𝙚𝙘𝙞𝙖𝙡 💯
A scintillating show in the chase and a 𝗺𝗮𝗶𝗱𝗲𝗻 #TATAIPL 𝗵𝘂𝗻𝗱𝗿𝗲𝗱 for Shreyas Iyer 👏
Updates ▶️ https://t.co/2ADKr4dqhi#KhelBindaas | #LSGvPBKS pic.twitter.com/Q5sabMbsOo
— IndianPremierLeague (@IPL) May 23, 2026
పవర్ ప్లేలో నింపాదిగా ఆడిన అయ్యర్, ప్రభ్‌సిమ్రన్ జోడీ లక్నో బౌలర్లకు చుక్కలు చూపించింది. విధ్వంసక ఆటతో అర్ధ శతకం బాదిన ప్రభ్‌సిమ్రన్ 62 పరుగుల లైఫ్ లభించింది. ప్రిన్స్ యాదవ్ ఓవర్లో అతడు ఆడిన బంతిని బదొని క్యాచ్ అందుకున్నాడు. కానీ, బదొని చేతిలో ఉండగానే బంతి నేలకు తాకడంతో టీవీ అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే.. అర్జున్ టెండూల్కర్(1-36) సూపర్ యార్కర్‌తో అతడిని వెనక్కి పంపి మూడో 140 పరుగుల భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత సూర్యాన్ష్ శెడ్గే(9 నాటౌట్) తోడుగా అయ్యర్ జట్టును గెలిపించాడు. విజయానికి 3 పరగులు అవసరమవ్వగా సిక్సర్ బాదిన అయ్యర్ సెంచరీ పూర్తి చేసుకోగా ఏడు వికెట్ల తేడాతో నెగ్గిన పంజాబ్ ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది.
Yorker on point 🎯
Arjun Tendulkar denied earlier by a dropped catch but fetches his maiden #LSG wicket 👏
Updates ▶️ https://t.co/2ADKr4dqhi#TATAIPL | #KhelBindaas | #LSGvPBKS | @LucknowIPL pic.twitter.com/DiCZbP7GCB
— IndianPremierLeague (@IPL) May 23, 2026
ప్లే ఆఫ్స్ రేసులో లేని లక్నో సూపర్ జెయింట్స్ భారీ స్కోర్‌తో పంజాబ్ కింగ్స్‌కు సవాల్ విసిరింది. ఓపెనర్ జోష్ ఇంగ్లిస్(72) అర్ధ శతకంతో విరుచుకుపడగా.. అయుశ్ బదొని(43) ధనాధన్ ఆటతో అలరించాడు. మిడిలార్డర్‌ను చాహల్(2-21) కట్టడి చేయగా.. డెత్ ఓవర్లలో అబ్దుల్ సమద్(37 నాటౌట్) దూకుడుగా ఆడారు. దాంతో, పంజాబ్‌కు లక్నో 197 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.
