ముంబై: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ దుమ్మురేపేందుకు సిద్ధమయ్యాడు. చాలా కాలం క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోనీ 14వ సీజన్ ఆరంభానికి ముందే సూపర్ ఫామ్‌లోకి వచ్చేశాడు. చెన్నై శిక్షణ శిబిరంలో ధోనీ ధనాధన బ్యాటింగ్‌తో అలరిస్తున్నాడు.
తాజాగా టీమ్ నెట్ సెషన్లో ధోనీ మైదానం నలువైపులా భారీ సిక్సర్లు బాదుతున్న వీడియోను చెన్నై ఫ్రాంఛైజీ సోమవారం ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ధోనీ ఒక్కో షాట్ కొడుతుంటే ఈసారి అతను ఎంత కసిగా ఉన్నాడో అర్థమవుతుంది. ఈ ఏడాది చెన్నై అన్ని ఫ్రాంచైజీలకన్నా ముందే సన్నాహకాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.