Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Laxma Reddy | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Ravanth reddy ) పాలమూరు బిడ్డ అని చెప్పుకోవడం సిగ్గుగా ఉందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి ( Laxma Reddy ) పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో గురువారం పర్యటించిన సీఎం తొండి మాటలు, పనికి రాని మాటలు మాట్లాడి జిల్లా పరువు తీశాడని ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సీఎం తీరుపై విరుచుకుపడ్డారు.
జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అంటే సంతోషపడ్డం. కానీ ఇప్పుడు జిల్లా ప్రజలంతా బాధపడు తున్నారని తెలిపారు. మూడు సంవత్సరాలుగా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్( KCR) , కేటీఆర్(KTR ), హరీష్ రావు( Harish Rao) తిట్టుడు తప్ప ఇంకోటి లేదని విమర్శించారు. బీఆర్ఎస్ పాలనకు పదేళ్ల ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ త్రాగు నీళ్లు లేకుండా చేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో దరిద్రపు మహబూబ్ నగర్ జిల్లాను వలసల జిల్లా అని బిరుదులు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేసీఆర్ అధికారంలోకి వచ్చాక మహబూబ్ నగర్ జిల్లా కోసం పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్ట్ లుగా మార్చి పది లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని వె ల్లడించారు. దీంతో
వలసలు వాపస్ అయ్యాయి. పంటలు సాగు పెరిగింది. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. వలసలు స్టార్ట్ అయ్యాయని ఆరోపించారు. రేవంత్ రెడ్డి తెలివి తక్కువ పనుల వల్లే రాష్ట్రంలో కరువు పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పాలమూరు అభివృద్ధి చెందినది కేసీఆర్ హయాంలో తప్ప రేవంత్ రెడ్డి హయంలో మాత్రం కాదని స్పష్టం చేశారు.
కేసీఆర్ నీళ్లు ఎత్తిపోస్తే రేవంత్ ఢిల్లీకి డబ్బులు ఎత్తిపోస్తున్నాడని విమర్శించారు. హరీష్ రావుకు కేసీఆర్ మంత్రి పదవి ఇస్తే బ్రహ్మాండంగా పని చేశాడని తెలిపారు. ప్రస్తుతం కేటీఆర్,హరీష్ రావునే తట్టుకుంట లేవు. కేసీఆర్ బయటకు వస్తే ఏం తట్టుకుంటావని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం రక్తం చిందిస్తానని అంటున్న రేవంత్ రెడ్డి రక్తం ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎక్కించుకోరని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలో కాంగ్రెస్‌కు 9 సీట్లు రావడం కూడా గగనమే నని జోస్యం చెప్పారు. కోయిల్ సాగర్ నుంచి కొడంగల్‌కు నీళ్లు తీసుకెళితే కోయిల్ సాగర్ ఆయకట్టు రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
కరప్షన్ గురించి కమీషన్ గురించి బ్రాండ్ అంబాసిడర్లు మీరేనంటూ విమర్శించారు. మీడియా సమావేశంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్లు డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ,అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి , బీఆర్ఎస్ నేత అభిలాష్ రంగినేని తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Laxma Reddy | జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది : మాజీ మంత్రి లక్ష్మారెడ్డి
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Nanna Kutty | ‘నాన్న కుట్టి’ సినిమా రివ్యూ.. విజయ్ ఆంటోనీ ఎమోషనల్ జర్నీ ఆకట్టుకుందా?
RBI Gold Reserves | ఏడాదిలో 165 టన్నుల బంగారం వెనక్కి తెచ్చిన ఆర్బీఐ.. భారత్ వ్యూహమేంటి?
Jagapathi Babu | పనివాళ్ళతో కలిసి భోజనం చేసిన జగపతిబాబు.. స్టార్డమ్ పక్కనపెట్టి మనసులు గెలుచుకుంటున్న విలన్!
ట్రెండింగ్ వార్తలు
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!

