Iraq | పోలీస్ చెక్‌పోస్ట్‌పై ఐసిస్ ఉగ్రవాదుల దాడి.. 13 మంది దుర్మరణం
Iraq | పోలీస్ చెక్‌పోస్ట్‌పై ఐసిస్ ఉగ్రవాదుల దాడి.. 13 మంది దుర్మరణం | ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని చెక్ పాయింట్‌పై ఆదివారం తెల్లవారుజామున ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 13 మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారు. కిర్కుక్ నగరానికి దక్షిణాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ రషద్ ప్రాంతంలో ఈ దాడి అర్ధరాత్రి

బాగ్దాద్ : ఇరాక్ ఉత్తర ప్రాంతంలోని చెక్ పాయింట్‌పై ఆదివారం తెల్లవారుజామున ఐసిస్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడిలో 13 మంది పోలీసులు దుర్మరణం పాలయ్యారు. కిర్కుక్ నగరానికి దక్షిణాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్ రషద్ ప్రాంతంలో ఈ దాడి అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిందని ఇరాక్ సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. ఘటనలో 13 మంది పోలీసులు మరణించారని భద్రతా, వైద్య వర్గాలు ధ్రువీకరించాయి. ఇస్లామిక్ స్టేట్ ఆర్గనైజేషన్ ఉగ్రవాదులు ఫెడరల్ పోలీస్ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారని ఆయన పేర్కొన్నారు. భద్రతా దళాల్లోని 13 మంది సభ్యులు మృతి చెందారని, మరో ముగ్గురికి గాయాలయ్యాయని ఆ అధికారి తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

