Shri Ramayana Yatra | ఐఆర్సీటీసీ శ్రీరామాయణ యాత్ర షురూ.. ట్రైన్లో సౌకర్యాలు సూపర్!
IRCTC'S 'Ramayana Circuit' Shri Ramayana Yatra | ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రామాయణ సర్క్యూట్లో భాగంగా ‘శ్రీరామాయణయాత్ర’ డిలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును

న్యూఢిల్లీ : ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) రామాయణ సర్క్యూట్లో భాగంగా ‘శ్రీరామాయణయాత్ర’ డిలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును నడిపిస్తోంది. ఆదివారం ఢిల్లీ సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్ నుంచి తొలి పర్యటన.. శ్రీరాముడితో సంబంధం ఉన్న అన్ని ప్రదేశాలను, ఆలయాలను కవర్ చేస్తూ యాత్ర సాగనున్నది. ఐఆర్సీటీసీ ప్రారంభించిన ఈ యాత్రకు భారీ స్పందన లభిస్తున్నది. తొలి పర్యటనకు సంబంధించి అన్ని సీట్లు బుకింగ్ జరిగాయని పేర్కొన్నది. పర్యాటకుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ 12న రామాయణ యాత్ర నిర్వహించాలని నిర్ణయించింది.

యాత్ర సాగేదిలా..
యాత్ర 17 రోజుల పాటు సాగనున్నది. సఫ్దర్‌జంగ్ రైల్వేస్టేషన్లో రైలు ప్రారంభమయ్యాక.. మొదటి హాల్ట్ శ్రీరాముడి జన్యభూమి అయోధ్యలో ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడి, హన్మాన్ ఆలయాలతో పాటు నందిగ్రామ్‌లో భారత్ మందిరాన్ని దర్శించుకోవచ్చు. ఆ తర్వాత బిహార్‌లోని సీతామర్హిలోని సీతామాత జన్మస్థలం, రోడ్డు మార్గంలో ఉన్న జనక్పూరిలోని రామ్-జానకీ ఆలయాన్ని సందర్శించిన అనంతరం రైలు వారణాసి బయలుదేరుతుంది.

పర్యాటకులకు రోడ్డు మార్గంలో వారణాసి, ప్రయాగ, శృంగవర్పూర్, చిత్రకూట్ దేవాలయాలను సందర్శిస్తారు. వారణాసి, ప్రయాగ, చిత్రకూట్‌లో రాత్రి బసకు ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత రైలు నాసిక్‌కు బయలుదేరుతుంది. ఇక్కడ త్రయంబకేశ్వరాలయం.. పంచవటి తదితర ప్రదేశాలను చూపిస్తారు. అనంతరం కిష్కింధ నగరం హంపి.. ఆ తర్వాత చివరగా రామేశ్వరం తీసుకెళ్తారు. ఆ తర్వాత రైలు 17వ రోజున ఢిల్లీకి తిరిగి చేరుతుంది. పర్యాటకులు దాదాపు 7500 కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

ప్యాకేజీ ఎంతంటే..!
దేశీయ పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ‘దేఖో అప్నా దేశ్’ చొరవలో భాగంగా ఐఆర్సీటీసీ ప్రత్యేకంగా రామాయణ యాత్ర రైలును ప్రారంభించింది. ఇందులో ఒక్కో వ్యక్తికి ప్యాకేజీలో భాగంగా సెకండ్ ఏసీకి రూ.82.950, ఫస్ట్ ఏసీకి రూ.1,02,095 ధర నిర్ణయించారు. రైలు మొత్తం ఏసీ సౌకర్యం కల్పించారు. స్టార్ హోటల్ స్థాయిలో వసతులు కల్పించగా.. శాఖాహార భోజనం అందించనున్నారు.

పర్యాటకులకు బీమా సదుపాయం కూడా కల్పించనున్నారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారు. 18 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సున్న పర్యాటకులందరికీ తప్పనిసరిగా రెండు డోసుల కొవిడ్ టీకాలు తీసుకుంటేనే అనుమతి ఇస్తున్నారు. ఫేస్ మాస్క్‌లు, హ్యాండ్ గ్లోవ్స్, శానిటైజర్ ఉన్న సేఫ్టీ కిట్లను పర్యాటకులందరికీ ఐఆర్సీటీసీ అందిస్తున్నది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

