మృతదేహానికీ ఉరిశిక్ష అమలు.. ఇరాన్లో ఇచ్ఛంత్రం..!

న్యూఢిల్లీ: ఇరాన్లో ఒక విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. ఉరిశిక్ష పడిన ఓ మహిళ గుండెపోటుతో చనిపోగా రజాయ్ షెహర్ జైలు అధికారులు ఆమె మృతదేహానికి ఉరిశిక్ష అమలు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఇరాన్‌కు చెందిన జహ్రా ఇస్మాయిలీ అనే మహిళకు భర్తను చంపిన కేసులో నేరం రుజువు కావడంతో ఉరిశిక్ష పడింది. ఈ నెల 23న అమెతోపాటు ఉరిశిక్షపడిన చాలామందికి ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉండటంతో అధికారులు అప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు.
ఫిబ్రవరి 23న ఉదయం నుంచి దోషులు ఒక్కొక్కరిని ఉరితీయడం మొదలుపెట్టారు. జహ్రా ఇస్మాయిలీ కంటే ముందు మొత్తం 16 మందిని ఉరితీశారు. వారంతా విలవిల్లాడుతూ ప్రాణాలు విడువడం కళ్లారా చూసిన జహ్రా భయంతో వణికిపోయింది. తీరా ఆమెను ఉరితీసేందుకు వేదికపై ఎక్కించగానే గుండెపోటు వచ్చి కుప్పకూలింది. అక్కడే ఉన్న వైద్యులు పరిశీలించి ఆమె మృతిచెందినట్లు ధృవీకరించారు.
అయినా, అధికారులు విడిచిపెట్టకుండా ఆమె శవానికి ఉరిశిక్ష అమలుచేశారు. ఉరిశిక్షకు కొన్ని క్షణాల ముందు ఖైదీ మరణిస్తే ఏం చేయాలనే విషయంలో కచ్చితమైన నిబంధన ఏదీ లేకపోవడంతో ఉన్న నిబంధన ప్రకారమే ఆమె శవానికి ఉరితీశారు. తన కుమారుడిని చంపిందన్న కసితో ఉన్న అత్త కూడా కనికరం చూపలేదు. జహ్రా కూర్చుని ఉన్న కుర్చీని తన్నేసి ఉరిశిక్ష అమలు చేసింది.
ఇరాన్లో ఉరిశిక్ష పడిన దోషులను ఉరితీసేటప్పుడు ఆ ఉరిశిక్షల అమలును చూసేందుకు బాధితుల కుటుంబసభ్యులకు అనుమతి ఇస్తారు. ఉరికంబం వద్ద దోషులకు మెడకు ఉరితాడు వేసిన తర్వాత వారు కూర్చున్న కుర్చీని తన్నేసి ఉరిశిక్షను పూర్తిచేసే హక్కు బాధితుల కుటుంబానికి ఉంటుంది. తమకు న్యాయం జరిగిందన్న భావన కలుగడంతోపాటు, తమ చేతులతోనే దోషిని చంపేశామన్న తృప్తి బాధితులకు లభిస్తుందన్న ఉద్దేశంతో ఇరాన్‌తో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SKN | రాధికా ఆప్టే వ్యాఖ్యలపై ఎస్కేఎన్ ఫైర్.. పాత వీడియోతో నిర్మాతకు నెటిజన్ల కౌంటర్!
Suicides | అనంతపురం జిల్లాలో విషాదం.. రైలు కిందపడి తల్లి, ఇద్దరు కుమార్తెలు ఆత్మహత్య..!
Guwahati Hotel Firing: గౌహతి హోటల్ ఫైరింగ్ కేసులో ప్రధాన నిందితుడి ఎన్కౌంటర్
Luxury Watches Missing | పలు కేసులకు సంబంధించిన లగ్జరీ వాచ్‌లు, ఇతర సాక్ష్యాధారాలు.. కోర్టు స్ట్రాంగ్ రూమ్ నుంచి మాయం
PM Modi Phone | ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్..రెండు తుపాన్ల ప్రభావంపై ఆరా
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

