రాజ్యసభను వీక్షించిన ఐపీయూ అధ్యక్షుడు డార్టీ పాచికో

న్యూఢిల్లీ: జెనీవాలో ఉన్న ఇంటర్ పార్లమెంటరీ యూనియన్(ఐపీయూ) అధ్యక్షుడు డార్టీ పాచికో ఇవాళ రాజ్యసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించారు. సభ జరుగుతున్న సమయంలో ఆయన గ్యాలరీ నుంచి కార్యక్రమాలను పరిశీలించారు. ఏడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు వచ్చారు. మంగళవారం రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగే కార్యక్రమంలో డార్టీ పాచికో.. భారతీయ ఎంపీలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పోర్చుగల్ పార్లమెంట్ సభ్యుడైన పాచికో.. ఇటీవల ఐపీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. భారత పార్లమెంట్ పంపిన ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడకు వచ్చారు. ఐపీయూను 1889లో స్థాపించారు. దీంట్లో 179 సభ్యదేశాలు ఉన్నాయి.
పార్లమెంట్ ఆవరణలో ఐపీయూ అధ్యక్షుడు డార్టీ పాచికో మీడియాతో మాట్లాడారు. అతి ప్రాచీన, అత్యంత పెద్ద దేశాల పార్లమెంట్ వ్యవస్థలతో ఇంటెరాక్ట్ కావడం ఐపీయూ ఉద్దేశమని, అందుకే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్కు వచ్చినట్లు ఆయన చెప్పారు. ఏదైనా మార్గం కనిపిస్తే.. భారత్, ఐపీయూ మధ్య సహకారాన్ని మరింత పెంపొందించనున్నట్లు ఆయన తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

