ఇక్కడా వారం రోజులు ఉండనిచ్చేలా లేరు.. ఇన్‌స్టాగ్రామ్‌పై కంగనా

ముంబై: ఇప్పటికే కంగనా రనౌత్ అకౌంట్‌పై ట్విటర్ శాశ్వతంగా నిషేధం విధించిన సంగతి తెలుసు కదా. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అక్కడ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసపై అనుచిత పోస్టులు చేసిన కారణంగా ట్విటర్ ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. తాజా ఇన్స్టాగ్రామ్ కూడా కొవిడ్-19పై ఆమె చేసిన ఓ పోస్ట్‌ను తొలగించింది. ఈ విషయాన్ని కంగానానే తన ఇన్‌స్టా స్టోరీలో చెబుతూ.. ఇక్కడా నన్ను వారం రోజుల కంటే ఎక్కువ ఉండనిచ్చేలా లేరు అని కామెంట్ చేయడం విశేషం. రెండు రోజుల కిందట తనకు కరోనా సోకిందన్న విషయం ఆమె చెప్పిన సంగతి తెలుసు కదా. ఆ పోస్ట్‌నే ఇన్‌స్టా డిలీట్ చేసింది.
ఇదో చిన్న ఫ్లూ మాత్రమే. అనవసరంగా ఎక్కువ చేసి చూపించారు. మీరు భయపడకండి. అందరం కలిసి దీనిని ఎదుర్కొందాం అని కంగనా ఆ పోస్ట్‌లో రాసింది. దీనిపై అప్పుడే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దేశంలో ఇన్ని కేసులు వచ్చి, ఇంత మంది చనిపోతుంటే ఇదో చిన్న ఫ్లూ అంటావా అంటూ చాలా మంది మండిపడ్డారు. దీంతో ఇన్‌స్టా ఆ పోస్ట్‌ను డిలీట్ చేసింది. ఇదే విషయాన్ని తన స్టోరీలో చెప్పింది. కొవిడ్‌ను నాశనం చేస్తా అన్నందుకు కొంత మంది హర్ట్ అయ్యారట. ఇన్‌స్టాకు వచ్చి రెండు రోజులైంది కానీ ఇక్కడ కూడా వారం కంటే ఎక్కువ ఉండనిచ్చేలా లేరు అని కంగనా కామెంట్ చేసింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

