హైదరాబాద్ రావాల్సిన ఇండిగో ఫ్లైట్.. భువనేశ్వర్‌లో అత్యవసర ల్యాండింగ్
Indigo Flight Makes Emergency Landing At Bhubaneswar Airport After Medical Emergency |

భువనేశ్వర్ : ప్రయాణికులతో వెళ్తున్న ఇండిగో విమానాన్ని గురువారం భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. ఇండిగోకు చెందిన 6E-946 కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు సాయంత్రం 4.40గంటలకు బయలుదేరింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఓ ప్రయాణుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లు సిబ్బందికి తెలుపడంతో వెంటనే విమానాన్ని భువనేశ్వర్‌కు మళ్లించినట్లు ఒడిశాలోని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ తెలిపారు.
సాయంత్రం 5.55 గంటల సమయంలో విమానం ల్యాండ్ కాగా.. వైద్యులు వచ్చి పరీక్షలు నిర్వహించారు. సదరు వ్యక్తికు గుండెపోటు వచ్చినట్లు నిర్ధారించారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో తక్షణ వైద్య సేవలు అందించి, సమీపంలోని ఆసుప్రతికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు భువనేశ్వర్‌లోని ఓ ఆసుప్రతి అత్యవసర విభాగానికి తరలించారు. అయితే, అతన్ని పరీక్షించిన వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. మృతుడిని జయబ్రత ఘోష్‌గా గుర్తించారు. మృతుడు ముగ్గురు కుటుంబ సభ్యులతో కలిసి విమానంలో ప్రయాణించినట్లు అధికారులు పేర్కొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

