వార్సవ్(పోలాండ్): ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ బ్లిట్జ్ విభాగంలో భారత స్టార్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి జోరు కనబరుస్తున్నది. ర్యాపిడ్ విభాగంలో నిలబెట్టుకోలేకపోయిన హంపి..బ్లిట్జ్‌లో సత్తాచాటుతున్నది. బుధవారం తొమ్మిది రౌండ్లు పూర్తయ్యే సరికి ఏడు పాయిట్లతో మూడోస్థానంలో నిలిచింది. భారత్‌కే చెందిన వైశాలి 7.5 పాయింట్లతో రెండులో ఉంది. తొలి రెండు గేములు గెలిచిన హంపి ఆ తర్వాత పుంజుకుని వరుస విజయాలు సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో తెలంగాణ యువ గ్రాండ్‌మాస్టర్ ఇరిగేసి అర్జున్ 21 రౌండ్లకు గాను తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి 6.5 పాయింట్లతో 12వ స్థానంలోఉన్నాడు.