టొరంటో, అక్టోబర్ 27: కెనడా రక్షణ మంత్రిగా భారత సంతతి మహిళ అనితా ఆనంద్ (54) నియమితులయ్యారు. ఇంతకుముందు కూడా భారత సంతతికే చెందిన హర్జీత్ సజ్జన్ కెనడా రక్షణ మంత్రిగా ఉన్నారు. సైన్యంలో లైంగిక వేధింపుల వ్యవహారంపై దర్యాప్తు విషయంలో హర్జీత్పై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కెనడా ప్రధాని ట్రూడో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేశారు. హర్జీత్ స్థానంలో అనితను నియమించగా ఆమె బాధ్యతలను స్వీకరించారు.