లాస్ వెగాస్: భారతీయ అమెరికా సంతతికి చెందిన గాయని ఫాల్గుణి షాకు గ్రామీ అవార్డు దక్కింది. ఫాలూ పేరుతో ఆమె స్టేజ్ షోలు నిర్వహిస్తోంది. బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో ఫాల్గుణి ఆ అవార్డును గెలుచుకున్నది. ఎ కలర్ఫుల్ వరల్డ్ ఆల్బమ్ కోసం ఆమెకు ఆ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్లో ఆమె పోస్టు చేసింది. గతంలో ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహ్మాన్తోనూ ఫాల్గుణి కలిసి పనిచేశారు. బెస్ట్ చిల్డ్రన్స్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరీలో భారతీయ సంతతి మహిళగా అవార్డు కోసం రెండుసార్లు పోటీపడిన ఏకైక మహిళగా ఫాల్గుణి నిలిచారు. ఎ కలర్ఫుల్ వరల్డ్ ఆల్బమ్కు పనిచేసిన ప్రతి ఒక్కరికీ ఆమె థ్యాంక్స్ తెలిపారు.