పొట్టి ప్రపంచకప్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయిన టీమ్ఇండియా.. సొంతగడ్డపై విశ్వరూపం కనబర్చింది. మెగాటోర్నీలో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ఒకటికి మూడుసార్లు బదులు తీర్చుకుంటూ.. టీ20 సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. లక్ష్యాన్ని ఛేదించడంలోనే కాదు నిర్దేశించడంలోనూ తాము తక్కువ కాదంటూ ఈసారి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమ్ఇండియా.. రోహిత్ పరాక్రమానికి లోయర్ ఆర్డర్ మెరుపులు తోడవడంతో భారీ స్కోరు చేయగా.. ఛేదనలో అక్షర్ పటేల్ ధాటికి కివీస్ బ్యాటర్లు విలవిల్లాడారు. పూర్తిస్థాయి సారథిగా రోహిత్ శర్మ తొలి టైటిల్ ముద్దాడితే.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ సిరీస్ విజయంతో ప్రయాణం షురూ చేశాడు.
కోల్‌కతా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు.. సొంతగడ్డపై న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగి 3-0తో ట్రోఫీ చేజిక్కించుకుంది. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్ కాగా.. హెడ్‌కోచ్‌గా మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ బోణీ కొట్టాడు. ఈ మ్యాచ్‌కు ముందే సిరీస్ పట్టేసిన టీమ్ఇండియా.. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో 73 పరుగుల తేడాతో ప్రపంచకప్ రన్నరప్ కివీస్‌పై జయభేరి మోగించింది. గతేడాది కివీస్ గడ్డపై జరిగిన టీ20 సిరీస్‌ను కూడా టీమ్ఇండియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా మూడో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ ఈ సారి మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించగా.. భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (29; 6 ఫోర్లు) ధాటిగా ఆడగా.. శ్రేయస్ అయ్యర్ (25), వెంకటేశ్ అయ్యర్ (20), హర్షల్ పటేల్ (18; 2 ఫోర్లు, ఒక సిక్సర్), దీపక్ చాహర్ (21 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన పరుగులు జోడించారు. న్యూజిలాండ్ బౌలర్లలో శాంట్నర్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ మార్టీన్ గప్టిల్ (51; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) తప్ప మిగిలినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 3, హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు. వరుస ఓవర్లలో మిచెల్ (5), చాప్మన్ (0), ఫిలిప్స్ (0)ను ఔట్ చేసిన అక్షర్ ఆరంభంలోనే దెబ్బ కొట్టడంతో ఇక ఏ దశలోనూ కివీస్ కోలుకోలేకపోయింది. అక్షర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, రోహిత్ శర్మకు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి. ఇరు జట్ల మధ్య గురువారం నుంచి రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.
గంట కొట్టిన దాదా
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. ఆదివారం ఈడెన్ గార్డెన్స్‌లో సంప్రదాయ గంటను మోగించి భారత్, న్యూజిలాండ్ మధ్య మూడో టీ20ని ప్రారంభించాడు
ఆరంభం అదుర్స్
ఇప్పటికే సిరీస్ చేజిక్కడంతో ఈ మ్యాచ్‌లో ప్రయోగాలు చేయాలనుకున్న టీమ్ఇండియా.. కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను, అశ్విన్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్‌కు తుది జట్టులోకి తీసుకుంది. బ్యాటింగ్ బృందానికి అసలు సిసలు పరీక్ష పెట్టేందుకు వరుసగా మూడో మ్యాచ్‌లో టాస్ నెగ్గిన రోహిత్ ఈసారి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అందుకు తగ్గట్లే క్రీజులో అడుగుపెట్టిన మరుక్షణం నుంచే భారత ఓపెనర్లు ప్రత్యర్థి బౌలర్లపై దండయాత్ర ప్రకటించడంతో పవర్ ప్లే ముగిసేసరికి భారత్ 69/0తో పటిష్ట స్థితిలో నిలిచింది. రోహిత్, ఇషాన్ ఒకరితో ఒకరు పోటీ పడుతూ బౌండ్రీలు బాదడంతో స్కోరు బోర్డు రాకెట్‌ను తలపించింది. బౌల్ట్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు కొడితే.. రెండో ఓవర్లో మిల్నేకు ఇషాన్ అదే శిక్ష వేశాడు. మూడో ఓవర్లో రోహిత్ సిక్సర్, ఇషాన్ ఫోర్ బాదగా.. ఆరో ఓవర్లో ఇద్దరు కలిసి 4,4,6,4 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. శాంట్నర్ రంగంలోకి దిగడంతోనే భారత బ్యాటింగ్ తడబడింది. ఇషాన్‌తో పాటు సూర్యుకుమార్ యాదవ్ (0)ను ఒకే ఓవర్లో ఔట్ చేసిన శాంట్నర్.. తదుపరి ఓవర్లో పంత్ (4)ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. దీంతో మూడు ఓవర్ల వ్యవధిలో టీమ్ఇండియా 83/3తో కష్టాల్లో పడింది. అయితే లోయర్ ఆర్డర్లో తలా కొన్ని పరుగులు చేయడంతో టీమ్ఇండియా.. ప్రత్యర్థి ముందు మంచి లక్ష్యాన్ని నిర్దేశించ గలిగింది.
స్కోరు బోర్డు
భారత్: రోహిత్ (సి అండ్ బి) సోధి 56, ఇషాన్ (సి) సీఫెర్ట్ (బి) శాంట్నర్ 29, సూర్యకుమార్ (సి) గప్టిల్ (బి) శాంట్నర్ 0, పంత్ (సి) నీషమ్ (బి) శాంట్నర్ 4, శ్రేయస్ (సి) మిచెల్ (బి) మిల్నె 25, వెంకటేశ్ (సి) చాప్మన్ (బి) బౌల్ట్ 20, అక్షర్ (నాటౌట్) 2, హర్షల్ (హిట్‌వికెట్) ఫెర్గూసన్ 18, దీపక్ (నాటౌట్) 21, ఎక్స్‌ట్రాలు: 9, మొత్తం: 20 ఓవర్లలో 184/7. వికెట్ల పతనం: 1-69, 2-71, 3-83, 4-103, 5-139, 6-140, 7-162, బౌలింగ్: బౌల్ట్ 4-0-31-1, మిల్నె 4-0-47-1, ఫెర్గూసన్ 4-0-45-1, శాంట్నర్ 4-0-27-3, సోధి 4-0-31-1.
న్యూజిలాండ్: గప్టిల్ (సి) సూర్యకుమార్ (బి) చాహల్ 51, మిచెల్ (సి) హర్షల్ (బి) అక్షర్ 5, చాప్మన్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 0, ఫిలిప్స్ (బి) అక్షర్ 0, సీఫెర్ట్ (రనౌట్) 17, నీషమ్ (సి) పంత్ (బి) హర్షల్ 3, శాంట్నర్ (రనౌట్/ఇషాన్) 2, మిల్నె (సి) రోహిత్ (బి) వెంకటేశ్ 7, సోధి (సి) సూర్యకుమార్ (బి) హర్షల్ 9, ఫెర్గూసన్ (సి అండ్ బి) దీపక్ 14, బౌల్ట్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 1, మొత్తం: 17.2 ఓవర్లలో 111 ఆలౌట్. వికెట్ల పతనం: 1-21, 2-22, 3-30, 4-69, 5-76, 6-76, 7-84, 8-93, 9-95, 10-111, బౌలింగ్: భువనేశ్వర్ 2-0-12-0, దీపక్ 2.2-0-26-1, అక్షర్ 3-0-9-3, చాహల్ 4-0-26-1, వెంకటేశ్ 3-0-12-1, హర్షల్ 3-0-26-2.