అహ్మదాబాద్ : సొంతగడ్డపై భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపిస్తున్నది. ఇదివరకే వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి తొలి టెస్టులోనూ నెగ్గిన జోష్‌లో ఉన్న యువ భారత్.. సోమవారం నుంచి మొదలైన రెండో అనధికారిక టెస్టులోనూ సత్తాచాటింది.
యువ స్పిన్నర్ తన్మయ్ బలోడా (6/32) ఆరు వికెట్లతో విజృంభించిన వేళ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 174 రన్స్‌కే కుప్పకూలింది. అతడికి తోడు అయాన్ ఖాన్ (2/45) సైతం రాణించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 38 రన్స్ చేసింది.